Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కల నెరవేరబోతున్నట్లేనా?

By:  Tupaki Desk   |   17 Jan 2016 9:48 AM GMT
ఎన్టీఆర్ కల నెరవేరబోతున్నట్లేనా?
X
ఎన్టీఆర్ పైకి చెప్పి ఉండకపోవచ్చు కానీ.. 50 కోట్ల షేర్ మార్కు అందుకోవాలన్నది అతడి కల. కెరీర్ ఆరంభంలోనే ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన ఎన్టీఆర్.. ఇప్పటిదాకా యాభై కోట్ల మార్కును అందుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. వరుస ఫెయిల్యూర్లు అతణ్ని వెనక్కి లాగేశాయి. మాస్ కు మాత్రమే కనెక్టయ్యే సినిమాలు చేయడం కూడా దీనికి మరో కారణం. ఐతే ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో క్లాస్ ఆడియన్స్ కు కూడా కూడా చేరువవడం.. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడం... కళ్లు చెదిరే ఓపెనింగ్స్.. ఇవంతా చూస్తుంటే ఈసారి యంగ్ టైగర్ 50 క్రోర్స్ మైల్ స్టోన్ అందుకునేలాగే కనిపిస్తున్నాడు.

తొలి మూడు రోజుల్లోనే ‘నాన్నకు ప్రేమతో’ ప్రపంచ వ్యాప్తంగా రూ.30 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. సంక్రాంతికి పోటీ తీవ్రంగా ఉన్నా ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టడం విశేషమే. మరి ఎన్టీఆర్ మిగతా రూ.20 కోట్లు కూడా కొల్లగొట్టేసి 50 కోట్ల మార్కును అందుకుంటాడా లేదా అన్నది ఆసక్తికరం. మూడు రోజుల్లోనే 30 కోట్లు వచ్చినపుడు.. ఫుల్ రన్ లో ఇంకో రూ.20 కోట్లు రాబట్టడం తేలికే అనిపించొచ్చు. కానీ అది మరీ అంత సులువేమీ కాదు. ఆదివారంతో సంక్రాంతి సెలవులు పూర్తవుతాయి. కాబట్టి థియేటర్లు నిండటం కష్టం. మరవైపు పోటీలో ఉన్న సినిమాలన్నీ కూడా పాజిటివ్ టాక్ తోనే నడుస్తున్నాయి. వచ్చే వారం రెండు కొత్త సినిమాలు కూడా రిలీజవుతున్నాయి కాబట్టి కొన్ని థియేటర్లు కూడా ఖాళీ చేయాలి. ఈ నేపథ్యంలో 50 కోట్ల మార్కు అందుతుందా లేదా అన్నది ఉత్కంఠ రేపే విషయమే.