Begin typing your search above and press return to search.
బుకింగ్స్ లో ఎన్టీఆరే కింగప్పా
By: Tupaki Desk | 12 Jan 2016 4:23 AM GMTటాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. ఇంకొక్క రోజులో సంక్రాంతి పోరుకు తెర లేవనుంది. టాలీవుడ్ లో గత కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా నాలుగు క్రేజ్ ఉన్న సినిమాలు ఒకేసారి తలపడుతూ తమ సత్తా చూపించడానికి రెడీ అవుతున్నాయి. రేసు ఆల్రెడీ మొదలైపోయింది. అందరూ అడ్వాన్స్ బుకింగ్స్ బరిలోకి దిగిపోయారు. ఐతే విడుదల తర్వాత ఎవరు విజేతగా నిలుస్తారన్నది తర్వాత కానీ.. ప్రస్తుతానికైతే ఎన్టీఆరే దూసుకెళ్తున్నాడు. అన్నింట్లోకి ముందు విడుదలయ్యేది ‘నాన్నకు ప్రేమతో’నే కాబట్టి దీనికే ఎక్కువ బుకింగ్స్ ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఐతే మిగతా సినిమాలకు దీనికి అంతరం ఎక్కువగానే కనిపిస్తోంది.
ఫస్ట్ డే దాదాపుగా అన్ని షోలకూ ‘నాన్నకు ప్రేమతో’ బుకింగ్స్ దాదాపుగా పూర్తి అయిపోయాయి. చాలా షోలకు టికెట్లు అమ్ముడైపోగా.. అక్కడక్కడా కొన్ని షోలకు కొన్ని ఖాళీలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి తొలి రోజు పోటీ లేదు కాబట్టి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అటు ఇటుగా వెయ్యి థియేటర్లు ఇచ్చారు. అయినప్పటికీ బుకింగ్స్ విషయంలో జోరు కనిపిస్తోంది.