Begin typing your search above and press return to search.
నాన్నకు ప్రేమతో 8 కోట్లు నష్టంతో క్లోజ్
By: Tupaki Desk | 11 March 2016 5:30 PM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్- ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో పెద్ద సక్సెస్ సాధించింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అంతే కాదు.. జూనియర్ ని తొలిసారిగా 50 కోట్ల షేర్ వసూళ్ల క్లబ్ లోకి చేర్చి.. ఈ స్టార్ హీరో కెరీర్ లోనే స్పెషల్ గా మిగిలిపోయింది. రీసెంట్ గా నాన్నకు ప్రేమతో చిత్రానికి 50 రోజుల పోస్టర్ కూడా వేశారు. 16 సెంటర్లలోనే అని వాళ్లే చెప్పేయడంతో.. ఇంకా వసూళ్లపై పెద్దగా హోప్స్ పెట్టుకోవాల్సిన పనిలేదు.
ఎన్టీఆర్ కి - సుకుమార్ కి సక్సెస్ అయితే ఇచ్చింది కానీ.. ఈ మూవీ అందరికీ సంతోషం మాత్రం ఇవ్వలేకపోయింది. ఇప్పటివరకూ ఈ చిత్రం సాధించిన వసూళ్ల మొత్తం 52 కోట్ల రూపాయలు. నాన్నకు ప్రేమతోకి జరిగిన థియేట్రికల్ బిజినెస్ 54 కోట్లతో పోల్చితే.. కేవలం 2 కోట్ల లాస్ తోనే కథ ముగిసింది అనిపిస్తుంది. ఇది ఓవరాల్ లుక్ మాత్రమే. నిజానికి నష్టాల లెక్క పెద్దదే ఉంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కి భారీ లాభాలు ఇచ్చిన జూనియర్.. లోకల్ గా మాత్రం పెద్దగా ప్రాఫిట్స్ పంచలేకపోయాడు. ఒక్క నైజాం ఏరియాలోనే డిస్ట్రిబ్యూటర్ కి 3.2 కోట్ల నష్టం వాటిల్లింది.
నాన్నకు ప్రేమతోను 14 కోట్లకు నైజాం హక్కులను కొనుగోలు చేయగా.. చివరకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్ షేర్ 10.8 కోట్ల వసూళ్లు మాత్రమే. మొత్తం మీద అన్ని ఏరియాల్లోనూ నష్టపోయినవారి లెక్కలన్నీ చూస్తే మొత్తం 8 కోట్ల రూపాయల నష్టంతో నాన్నకు ప్రేమతో బిజినెస్ క్లోజ్ అవుతోంది.