Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ పాట ఊపేస్తోంది
By: Tupaki Desk | 29 Dec 2015 11:36 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పాటలు పాడటం కొత్తేం కాదు. ఎనిమిదేళ్ల కిందటే ఓలమ్మీ తిక్క రేగిందా అంటూ తన గాన ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. తర్వాత 123 నేనొక కంత్రి - రాకాసి రాకాసి లాంటి పాటలు పాడాడు. ఐతే ఈ పాటలన్నీ ఒకెత్తయితే.. తాజాగా ‘నాన్నకు ప్రేమతో’ మూవీలో పాడిన ‘ఐ వానా ఫాలో ఫాలో’ పాట మరో ఎత్తులా ఉంది. మొన్న ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో విడుదలైన నాటి నుంచి ఈ పాట చార్ట్ బస్టర్ అవుతోంది. ఎక్కడ చూసినా ఐ వానా ఫాలో ఫాలో పాటే వినిపిస్తోంది. జనాలకు చాలా క్యాచీగా ఉండే ట్యూన్ కావడంతో.. ఈ జనాలకు ఇన్ స్టంట్ గా ఎక్కేసింది.
ఆల్రెడీ టీజర్ తోనే ఆకట్టుకున్న ఈ హమ్మింగ్.. ఇప్పుడు ఆడియో తర్వాత మరింతగా జనాల నోళ్లలో నానుతోంది. ఎన్టీఆర్ ఇంతకుముందు పాడిన ‘రాకాసి రాకాసి’ పాట పెద్ద హిట్టే కానీ.. అందులో అతడి ఒరిజినల్ వాయిస్ వినిపించలేదన్న విమర్శ ఉంది. ఐతే ‘ఐ వానా ఫాలో ఫాలో’లో మాత్రం ఎన్టీఆర్ వాయిస్ స్పష్టంగా వినిపిస్తోంది. అదే సమయంలో పాట శ్రావ్యంగా, క్యాచీగా ఉంది. దేవిశ్రీ రాసిన లిరిక్స్ కూడా ఆసక్తికరంగా జనాలు ఈజీగా కనెక్టయ్యేలా ఉన్నాయి. ‘‘నువ్వు కకకకాఫీ షాపుకెళ్తే అక్కడి కప్పు నేనే.. ఆ కప్పు నీ లిప్పు లిప్పు తాకుతుంటే ఆ సిప్పు నేనే’’ ఇలాంటి వాక్యాలతో సరదాగా సాగిపోతుందీ పాట. రిపీట్ మోడ్ లో తెగ ప్లే అయిపోతున్న ఈ పాట ఇప్పుడు ఎఫ్ఎం స్టేషన్లలోనూ సందడి చేస్తోంది.