Begin typing your search above and press return to search.
నందమూరి అభిమానులకు ఓ తాజా కబురు
By: Tupaki Desk | 14 Nov 2015 10:32 AM GMTనందమూరి అభిమానుల నరాల్లో కరెంటు ప్రవహింపజేస్తున్న సినిమా ‘నాన్నకు ప్రేమతో’. సుకుమార్ లాంటి టాప్ క్లాస్ డైరెక్టర్ తమ హీరోను సరికొత్త అవతారంలో చూపించబోతున్న ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే టీజర్ - పోస్టర్లు అభిమానుల్లో అంచనాల్ని భారీగా పెంచేశాయి. కొన్ని సెకన్ల టీజర్ తోనే మెస్మరైజ్ చేశాడు ఎన్టీఆర్. ఇక సినిమా ట్రైలర్ ఎప్పుడొస్తుందో.. ఆడియో ఎప్పుడు వింటామా.. సినిమా ఎప్పుడు చూస్తామా.. అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అభిమానుల్లోనే కాదు.. సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమా మీద మంచి ఆసక్తే ఉంది.
జనవరి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుండగా.. 25 రోజుల ముందు - అంటే డిసెంబరు 13న.. ఆదివారం హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ప్లానింగ్ ఇప్పటికే మొదలుపెట్టాడు నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్. ఆడియో ఫంక్షన్ కు ఇంకో నెల రోజులే టైం ఉంది. ఈ లోపు షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేయాలన్నది ప్లాన్. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ లో దేవి చేసిన హమ్మింగ్ - బ్యాగ్రౌండ్ స్కోర్ కే ఫిదా అయిపోయారు అభిమానులు. ఆడియో కూడా వాళ్ల అంచనాలకు తగ్గని స్థాయిలోనే ఉంటుందట. ఇప్పటికే దేవి ఇచ్చిన ఓ మాస్ ట్యూన్ కి అదిరిపోయే స్టెప్పులేస్తున్నాడట ఎన్టీఆర్. ఈ పాట పూర్తి చేశాక యూనిట్ అంతా స్పెయిన్ కు వెళ్లబోతోంది