Begin typing your search above and press return to search.

నాన్నకు ప్రేమతో ఆడియో డేట్ ఫిక్స్

By:  Tupaki Desk   |   7 Dec 2015 11:30 AM GMT
నాన్నకు ప్రేమతో ఆడియో డేట్ ఫిక్స్
X
ఓపక్క సంక్రాంతి రిలీజ్ డేట్ అందుకుంటామో లేదో అన్న టెన్షన్ ‘నాన్నకు ప్రేమతో’ టీంలో బాగానే ఉంది. ఐతే ప్రయత్నం చేయకుండా ముందే చేతులెత్తేయడానికి మాత్రం యూనిట్లో ఎవ్వరూ సిద్ధంగా లేరు. మన ప్రయత్నం మనం చేద్దాం. కుదిరితే సంక్రాంతి రిలీజ్.. లేకుంటే వాయిదా.. అన్నట్లు తమ పని తాము చేసుకెళ్లిపోతున్నారు సుకుమార్ - ఎన్టీఆర్. ప్రస్తుతానికి పొంగల్ రిలీజ్‌ కు ఫిక్స్ అయిపోయి ఆడియో రిలీజ్ డేట్ కూడా ఖాయం చేశారు. డిసెంబరు 23న హైదరాబాద్ లో భారీ ఎత్తున ఆడియో వేడుక చేయడానికి సన్నాహాలు మొదలుపెడుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ‘నాన్నకు ప్రేమతో’ టీం స్పెయిన్ షెడ్యూల్ లో ఉంది. ఇంతకుముందే ఓసారి ఇక్కడ కొన్ని రోజులు షూట్ చేశారు. ఇప్పుడు చివరి షెడ్యూల్లో మిగిలిన టాకీ పార్ట్ అంతా కూడా పూర్తి చేసుకుని వస్తారు. 20వ తారీఖు తర్వాత హైదరాబాద్ వస్తారని సమాచారం. వచ్చిన మూడు రోజులకు ఆడియో ఫంక్షన్ కానిచ్చేసి.. ఆ తర్వాత శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ చేయాలన్నది ప్లాన్. అంతా సవ్యంగా సాగితే ఓకే. కానీ ఏదైనా డిలే జరిగినా.. క్వాలిటీ విషయంలో తేడా వచ్చినా రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకోవడమే. కాబట్టి ‘నాన్నకు ప్రేమతో’ సంక్రాంతికి రిలీజవుతుందా లేదా అన్న క్లారిటీ రావడానికి ఇంకా చాలా టైమే పడుతుందన్నమాట.