Begin typing your search above and press return to search.

ఎక్సక్లూజివ్‌: 27నే నాన్నకు ప్రేమతో ఆడియో

By:  Tupaki Desk   |   23 Dec 2015 7:24 PM GMT
ఎక్సక్లూజివ్‌: 27నే నాన్నకు ప్రేమతో ఆడియో
X
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డేట్‌ అఫీషియల్‌ గా కన్ఫాం అయిపోయింది. నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ఒక ఈవెంట్‌ మేనేజ్‌ మెంట్‌ కంపెనీకు ఆడియో లాంచింగ్‌ పండుగను ఘనంగా చేయాలంటూ ఆర్డర్లు ఇవ్వడంతో.. అసలు విషయం బయటకు తెలిసిపోయింది.

యథావిథిగా ఇప్పటివరకు ప్రచారంలో ఉన్నట్లే.. డిసెంబర్‌ 27నే ఘనంగా నాన్నకు ప్రేమతో ఆడియో రిలీజ్‌ చేస్తారట. పాటల మాంత్రికుడు దేవిశ్రీప్రసాద్‌ అందించిన వినసొంపైన బాణీలను ఓ ఊహించని గెస్ట్‌ ఆ కార్య్రకమంలో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. అంతేకాదు.. సదరు ఆడియోను దేవిశ్రీ తండ్రి.. దివంగత సత్యమూర్తి కి అంకితం చేయనున్నారు. ఇప్పటికే పోస్టు ప్రొడక్షన్‌ తాలూకు పనులన్నీ ఒక కొలక్కి రావడంతో.. ఇక ఆడియో రిలీజ్‌ పై ఫోకస్‌ చేయాలని రిలయన్స్‌ ఎంటర్‌ టైన్మెంట్‌ మరియు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 27 సాయంత్రం శిల్పాకళా వేదికలో ఈ ఈవెంట్‌ జరగనుంది.

ఇకపోతే రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే.. ముందు నుండి చెబుతున్నట్లే జనవరి 13నే రిలీజ్‌ అంటూ పంపిణీదారులకు, అలాగే ఈవెంట్ మేనేజ్మంట్‌ కంపెనీలకు కూడా సెలవిచ్చారట. దీనిని 27న అఫీషియల్‌ గా ప్రకటిస్తారని అంటున్నారు.