Begin typing your search above and press return to search.
నాన్నకు ప్రేమతో.. యూ/ఏ సర్టిఫికేటా?
By: Tupaki Desk | 11 Jan 2016 11:58 AM GMTయంగ్ టైగర్ సంక్రాంతికి పండుగకు వస్తున్నాడా లేదా అనే డౌట్.. ఇప్పటివరకూ ఎవరికైనా ఏమూలైనా ఉంటే.. వాటిని క్లియర్ చేసేసుకోవచ్చు. హీరో - డైరెక్టర్ - నిర్మాత సహా అందరూ సంక్రాంతి రిలీజ్ అన్నా, అదే విషయంతో పోస్టర్స్ వేసినా, ఇంకా అనుమానాలు ఉండడానికి కారణం.. సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా రాకపోవడమే.
కానీ ఇప్పుడీ మూవీకి సెన్సార్ కూడా పూర్తయిపోయింది. నాన్నకు ప్రేమతో మూవీ చూసిన సెన్సార్ సభ్యులు.. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చేశారు. దీంతో ఇక 13న రిలీజ్ కు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లే. పొంగల్ ఫైట్ మరింత టఫ్ అయినట్లే. అయితే.. ఈ మూవీ పూర్తి స్థాయి సెంటిమెంట్ అని ఇప్పటికే చెప్పేశారు. ఫుల్ లెంగ్త్ గా ఎమోషన్స్ ను కేరీ చేస్తున్నట్లు ప్రోమోలు - టీజర్లు - ట్రైలర్ ను చూస్తే అర్ధమవుతుంది. మరి నాన్నకు ప్రేమతో లాంటి చిత్రానికి యూ/ఏ ఎందుకు వచ్చిందా అనే ఆలోచనలు మొదలయ్యాయి.
ఈ మూవీలో కుర్ర బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించినా.. ఆమె పంచిన గ్లామర్ అంతంత మాత్రమే. ఈ సర్టిఫికేట్ రావడానికి.. యాక్షన్ సన్నివేశాలా? లేక ఎమోషనల్ డైలాగులా? అనేది తెలియట్లేదు. మరోవైపు.. నాన్నకు ప్రేమతో నిడివి చాలా ఎక్కువగా ఉందని, మూడున్నర గంటలకు పైగా ఉండడంతో.. ఎడిట్ చేస్తారనే టాక్ ఉంది. అయితే.. మొత్తం సినిమాను సెన్సార్ చేసేయడంతో.. ఇక ఎంతమేరకు ఉంచాలో, ఎంత వరకూ తెంచాలి అన్నది యూనిట్ ఇష్టం. మరొక్క రోజు మాత్రమే రిలీజ్ కు గ్యాప్ ఉండడంతో.. ఎక్కువ రిస్క్ తీసుకోకపోవచ్చని అంటున్నారు.