Begin typing your search above and press return to search.

నాన్న‌కు ప్రేమ‌తో కొత్త రికార్డు

By:  Tupaki Desk   |   25 Jan 2016 7:00 AM GMT
నాన్న‌కు ప్రేమ‌తో కొత్త  రికార్డు
X
అమెరికాలో భీక‌ర‌మైన మంచు తుఫాన్ కురుస్తోంది. జ‌నం ఇళ్ల‌లోంచి బ‌య‌టికి రావ‌డానికే ఇబ్బంది ప‌డుతున్నారు. అలాంటి తుఫాన్‌ తో పోటీప‌డుతూ అక్క‌డ నాన్న‌కు ప్రేమ‌తో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. అందుకే తాజాగా మ‌రో రికార్డు ఆ సినిమా సొంత‌మైంది. అమెరికాలో హ‌య్య‌స్ట్ గ్రాస్ సాధించిన చిత్రాలుగా బాహుబ‌లి - శ్రీమంతుడు - అత్తారింటికి దారేది వ‌రుస స్థానాల్లో నిలిచాయి. అయితే ఇప్పుడు అత్తారింటికి దారేదిని అధిగ‌మించి నాన్న‌కు ప్రేమ‌తో మూడో స్థానాన్ని సొంతం చేసుకొంది.

ఇప్ప‌టికీ డ‌ల్లాస్‌ తోపాటు టెక్సాస్‌ లోని ప‌లు ప్రాంతాల్లో హౌస్‌ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో నాన్న‌కు ప్రేమ‌తో ర‌న్ అవుతోంద‌ట‌. భ‌విష్య‌త్తులో శ్రీమంతుడు రికార్డుని కూడా నాన్న‌కు ప్రేమ‌తో అధిగ‌మించొచ్చ‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌గ‌డుతున్నాయి. ఈ విష‌యంతో నాన్న‌కు ప్రేమ‌తో బృందం సంబ‌రాలు చేసుకొంటోంది. నిజానికి ఈ సినిమాని ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్లే గ‌ట్టున ప‌డేశాయి. తెలుగులో మిక్స్ డ్ రెస్పాన్స్‌ తోనే సినిమా ర‌న్ అవుతోంది. అయితే అమెరికాలో యునానిమస్‌ గా సినిమాని యాక్సెప్ట్ చేశారు ప్రేక్ష‌కులు. సుకుమార్ చిత్రాల‌కి అక్క‌డ ఎప్పుడూ మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంటుంది. సుక్కు ఇంటెలిజెన్సీని - సెన్సిబులిటీస్‌ ని అమెరికాలోని తెలుగు ప్రేక్ష‌కులు అమితంగా ఇష్ట‌ప‌డుతుంటారు. అందుకే అక్క‌డ సుకుమార్ చేసే ప్ర‌తీ సినిమా భారీ వ‌సూళ్ల‌ను సొంతం చేసుకొంటుంది. సుకుమార్ కూడా నేను ఇప్ప‌టికీ సినిమాలు తీయ‌గ‌లుగుతున్నానంటే ఎన్నారై ప్రేక్ష‌కులే కార‌ణం అని చెబుతుంటాడు. మొత్త‌మ్మీద సుకుమార్ వ‌ల్ల ఎన్టీఆర్ ఓవ‌ర్సీస్ బాక్సాఫీసును దుమ్ము దులిపేశాడు. భ‌విష్య‌త్తులో తార‌క్ సినిమాల బిజినెస్‌ కి నాన్న‌కు ప్రేమ‌తో మ‌రింత ఊత‌మిచ్చిన‌ట్టైంది.