Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఆ ఘనత ఎలా సాధించాడంటే..

By:  Tupaki Desk   |   30 Jan 2016 5:30 PM GMT
ఎన్టీఆర్ ఆ ఘనత ఎలా సాధించాడంటే..
X
మొత్తానికి ఎన్టీఆర్ కల నెరవేరింది. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో తొలిసారి తన కెరీర్లో 50 కోట్ల షేర్ ఘనతను అందుకున్నాడు యంగ్ టైగర్. ఎన్టీఆర్ మాస్ - సుకుమార్ క్లాస్ ఫ్యాన్స్ కలిసి ఈ సినిమాను 50 కోట్ల క్లబ్బులోకి లాక్కెళ్లిపోయారు. సరిగ్గా రెండు వారాలకే ఈ సినిమా రూ.50 కోట్ల మార్కును అందుకోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు వారాల్లో రూ.50.1 కోట్ల షేర్ సాధించడం విశేషం. గ్రాస్ వసూళ్లు రూ.79.5 కోట్లకు చేరడం గమనార్హం. మరి ఈ యాభై కోట్ల షేర్ ఎన్టీఆర్ ఎలా సాధించాడో చూద్దాం పదండి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ఏరియా అయిన నైజాంలో ‘నాన్నకు ప్రేమతో’ రెండు వారాల్లో రూ.10.22 కోట్లు కలెక్ట్ చేసింది. సీడెడ్లో రూ.6.06 కోట్లు వచ్చాయి. ఆంధ్రాలోని అన్ని జిల్లాలు కలిపి రూ.15.85 కోట్ల దాకా కలెక్టయింది. ఇలా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఎన్టీఆర్ మూవీ రూ.32 కోట్లకు పైగా ఖాతాలో వేసుకుంది. కర్ణాటక వసూళ్లు రూ.6 కోట్లకు చేరుకున్నాయి. ఇండియాలోని మిగతా ప్రాంతాలన్నీ కలిపి రూ.1.45 కోట్లు తెచ్చిపెట్టాయి. అమెరికాలో ‘నాన్నకు ప్రేమతో’ షేర్ రూ.8.72 కోట్లు రావడం విశేషం. మిగతా దేశాల్లో రూ.1.83 కోట్లు వసూలయ్యాయి. ఇలా మొత్తం లెక్క రూ.50 కోట్ల మార్కును దాటింది. ఎన్టీఆర్ కెరీర్లో ఇదే తొలి 50 క్రోర్స్ షేర్ మూవీ అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఇంకో నాలుగు కోట్లు సాధిస్తేనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు వచ్చినట్లవుతుంది.