Begin typing your search above and press return to search.

నాన్నకు ప్రేమతో.. నాలుగు ఇష్యూలు

By:  Tupaki Desk   |   13 Jan 2016 12:46 AM GMT
నాన్నకు ప్రేమతో.. నాలుగు ఇష్యూలు
X
అసలు తన సినిమా రిలీజ్‌ కు ముందే ఇన్నేసి వివాదాలకు కారణం అవుతుందని జూ.ఎన్టీఆర్‌ ఏ మాత్రం ఊహించే ఉండడు. ఎప్పుడూ సింపుల్‌ గా సినిమాలు చేసుకుంటూ పోతూ.. కావాలంటే సినిమాలోపల ఏమైనా పంచ్‌ డైలాగులు వాడుకుంటూ.. వాటితో తన అభిమానుల ఈగోను చల్లారుస్తూ.. అవి ప్రత్యర్ధులపై పేల్చిన తూటాలే అనిపించేలా తన యాక్టింగ్‌ తో మెస్మరైజ్‌ చేసుకునే తారక్‌.. ఇప్పుడు వివాదాల నడుమ చిక్కుకున్నాడు.

ముందుగా నాన్నకు ప్రేమతో పోష్టర్ తో గొడవ మొదలైంది. పోస్టర్లో తమ మతా చిహ్నాలను పోలిన ఫోటో ఫ్రేములను పెట్టి.. వాటి ముందు రకుల్‌ అర్ధనగ్నంగా డ్యాన్సు వేస్తోంది అంటూ ఒక కమ్యూనిటీ రచ్చ చేసింది. బైక్‌ ర్యాలి నుండి పోలీస్‌ కేసు వరకు జరిగిపోయాయ్‌. అక్కడాగితే.. నన్ను హరాస్‌ చేస్తున్నారంటూ డబ్బింగ్‌ ఆర్టిస్టు ఒకరు కంప్లయింట్‌ ఇచ్చారు. కట్‌ చేస్తే.. పవన్‌ కళ్యాన్‌ నిర్మాతపై ఒక కేసును పెట్టారు. దాన్ని ఫాలో అవుతూ త్రివిక్రమ్‌ కూడా అలాగే కేసు పెట్టారట. షార్టు టైములో ఏకంగా నలుగురి ఇష్యల్లో కూరుకుపోయింది నాన్నకు ప్రేమతో.

ప్రేమతో నాన్న కోసం సినిమా తీసినా.. జనాల దగ్గరకు తీసుకెళ్లేలోపే ఏదో ఒక కారణంతో కేసులు గోల తప్పలేదు. అసలు సినిమా రిలీజ్‌ అవుతుందా లేదా అంటూ ఇన్నాళ్లూ టెన్షన్‌ పడిన ఎన్టీఆర్‌ కు ఇవన్నీ కొత్త టెన్షన్లే.