Begin typing your search above and press return to search.

నాన్నకు ప్రేమతో.. బిజినెస్ స్టామినా ఎంత?

By:  Tupaki Desk   |   12 Jan 2016 12:18 PM GMT
నాన్నకు ప్రేమతో.. బిజినెస్ స్టామినా ఎంత?
X
జూనియర్ ఎన్టీఆర్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో రిలీజ్ కు గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. పొంగల్ సినిమాల్లో హైయెస్ట్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ఈ చిత్రానికి.. ఒకటి అరా తప్పా.. ఇప్పటికే అన్ని రకాల బిజినెస్ లు పూర్తయిపోయాయి. ఇప్పుడున్న టఫ్ ఫైట్ లోనే 55 కోట్ల రూపాయలను థియేటర్ల నుంచి రాబడితే మాత్రమే.. నాన్నకు ప్రేమతో చిత్రాన్ని బ్లాక్ బస్టర్ అనాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ఈ మూవీ బిజినెస్ 60 కోట్లు దాటిపోయింది. ఏపీ తెలంగాణల్లోనే థియేట్రికల్ రైట్స్ రూపంలో.. 40 కోట్ల రూపాయలకు విక్రయించారు. ఇక కర్నాటకతో పాటు ఓవర్సీస్ లో కలిపి 11 కోట్లకు రైట్స్ అమ్మారు. అంటే ప్రపంచవ్యాప్తంగా కేవలం థియేటర్ల రూపంలోనే 51కోట్ల మొత్తం నాన్నకు ప్రేమతో ద్వారా వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ హక్కులను 10.25 కోట్లు చెల్లించి జెమినీ టీవీ దక్కించుకుంది. ఆడియో రైట్స్ రూపంలో మరో 75 లక్షలు వచ్చాయి. అంటే మొత్తంగా 62 కోట్ల బిజినెస్ జరిగిందన్న మాట. ఈ పరిస్థితుల్లో 55కోట్ల షేర్ వసూళ్లను సాధిస్తేనే.. నాన్నకు ప్రేమతో మూవీని హిట్ గా లెక్క పెట్టాల్సి ఉంటుంది.

ఇది అంత తేలికైన విషయమేం కాదు. ఎందుకంటే, ఇప్పటివరకూ అసలు ఎన్టీఆర్ కెరీర్ లోనే 50 కోట్ల సినిమా లేదు. మరోవైపు ఇప్పుడున్న టఫ్ కాంపిటీషన్ ఏ మేరకు ఈ మార్క్ అందుకునేందుకు అడ్డుపడుతుందనే ఆసక్తి నెలకొంది. అయితే.. ఒకవేళ ఈ మూవీ హిట్ కొట్టగలిగితే మాత్రం.. కోలీవుడ్, శాండల్ వుడ్ ల నుంచి భారీ రేటుకు రీమేక్ ఆఫర్స్ రావచ్చు.