Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : నాన్నకు ప్రేమతో
By: Tupaki Desk | 13 Jan 2016 9:04 AM GMTచిత్రం : నాన్నకు ప్రేమతో
నటీనటులు- ఎన్టీఆర్ - రకుల్ ప్రీత్ సింగ్ - జగపతిబాబు - రాజేంద్ర ప్రసాద్ - రాజీవ్ కనకాల - అవసరాల శ్రీనివాస్ - తాగుబోతు రమేష్ తదితరులు
ఛాయాగ్రహణం: విజయ్ కె.చక్రవర్తి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
మాటలు: బుచ్చిబాబు - శ్రీనివాస్ - విక్రమ్
నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సుకుమార్
ఎన్టీఆర్.. సుకుమార్.. అస్సలు మ్యాచ్ కాని పేర్లివి. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఇద్దరూ కలిసి ‘నాన్నకు ప్రేమతో’ అంటూ ఓ సినిమా చేసేశారు. మొదలైన తొలి రోజు నుంచి సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
చేతిలో ఉన్న ఉద్యోగం పోగొట్టుకుని రోడ్డుమీదికి వచ్చేసిన అభిరామ్ (ఎన్టీఆర్) తనలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్లందరినీ పోగేసి.. ‘కేఎంసీ’ అనే పేరుతో ఓ కంపెనీ మొదలుపెడతాడు. ఇంతలో అతడికి తన తండ్రి (రాజేంద్ర ప్రసాద్) అనారోగ్యం గురించి తెలుస్తుంది. ఇంకో నెలా నెలన్నరలో చనిపోబోతున్న తండ్రి.. తాను ఒకప్పుడు కృష్ణమూర్తి (జగపతి బాబు) అనే వ్యక్తి చేతిలో ఎలా మోసపోయింది చెప్పి.. అతడిపై ప్రతీకారం తీర్చుకోవడమే తన చివరి కోరిక అని చెబుతాడు. మరి తండ్రి చివరి కోరిక తీర్చడానికి అభి ఏం చేశాడు? కృష్ణమూర్తిని అతను ఎలా దెబ్బ కొట్టాడు? అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
సుకుమార్ టాలీవుడ్ మోస్ట్ ఇంటలిజెంట్ డైరెక్టర్లలో ఒకడు. ఐతే ‘1 నేనొక్కడినే’ సినిమా విషయంలో అతడి ఇంటలిజెన్సే పెద్ద సమస్య అయింది. ప్రేక్షకుల బుర్రలకు మరీ ఎక్కువ పరీక్ష పెట్టేశాడు సుక్కు. గొప్ప సినిమా అన్న పేరొచ్చింది కానీ.. జనాలు ఆదరించలేదు. అంత మాత్రాన సుకుమార్ పూర్తిగా తనను తానేమీ మార్చేసుకోలేదు. రాజీ పడలేదు. ఈసారి కూడా తన ఇంటలిజెన్స్ చూపించాడు. ప్రేక్షకుడి మీద ప్రేమతో మరో మరో మంచి సినిమా అందించే ప్రయత్నమే చేశాడు. కాకపోతే ఈసారి ఊరికే కథాకథనాల్ని మలుపులు తిప్పేయలేదు. జనాలకు పజిళ్లు విసరలేదు. మనం ఎన్నోసార్లు చూసిన ఒక సింపుల్ కథనే ఎంచుకున్నాడు. దాన్ని తనదైన శైలిలో సరికొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. అడుగడుగునా సుకుమార్ ముద్ర కనిపించే ఈ సినిమాలో ఎన్టీఆర్ చక్కగా ఒదిగిపోవడమే ప్రత్యేకత.
ఎమోషన్.. ఎమోషన్.. ‘నాన్నకు ప్రేమతో’ విషయంలో మొదట్నుంచి వినిపిస్తున్న మాట ఇది. సినిమాలో ఈ ఎమోషనే హైలైట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎమోషన్ కంటే కూడా ‘ఇంటలిజెన్స్’ సినిమాకు ప్రధాన ఆకర్షణ అయింది. హీరో, అతడి తండ్రి మధ్య ఎమోషన్ కంటే కూడా.. హీరో, విలన్ మధ్య నడిచే ఇంటలిజెండ్ మైండ్ గేమే సినిమాను నిలబెట్టింది. బహుశా తెలుగులో ఇంతకుముందెన్నడూ ఇలాంటి మైండ్ గేమ్.. ఇలాంటి ఇంటలిజెంట్ వార్ చూసి ఉండమేమో. ఒక మామూలు కథనే అంత వైవిధ్యంగా, అంత పకడ్బందీగా చెప్పాడు సుకుమార్. తెలుగులో ఇలాంటి సినిమాలు సుకుమార్ మాత్రమే తీయగలడు అనిపించేలా టైటిల్స్ దగ్గర్నుంచి.. ఎండ్ టైటిల్ పడేవరకు అడుగడుగునా తన ముద్రలు వదిలాడతను.
కథ విషయంలో ఈసారి సుకుమార్ ఏమాత్రం గందరగోళానికి అవకాశమివ్వలేదు. ఫ్లాష్ బ్యాక్ లు, మలుపులు లాంటివేమీ లేకుండా నేరుగా హీరో, అతడి తండ్రి, విలన్ పాత్రల్ని పరిచేయం చేసి.. హీరోకు రివెంజ్ టాస్క్ ఫిక్స్ చేసి.. ఇదీ కథ అని తొలి 20 నిమిషాల్లోనే చెప్పేశాడు సుక్కు. ఇలా మొదట్లోనే కథేంటో చెప్పేశాక.. ఆ తర్వాత రెండు గంటలకు పైగా ప్రేక్షకుడిని ఆసక్తిగా కూర్చోబెట్టడం పెద్ద టాస్కే. ఐతే టాస్క్ మాస్టర్ సుకుమార్ ఆ పనిని తనదైన శైలిలో పూర్తి చేశాడు. ప్రతి సన్నివేశాన్నీ వైవిధ్యంగా తీర్చిదిద్దాలని, కొత్తగా ఏదో చెప్పాలని అతడు తపనతో చేసిన ప్రయత్నమే ‘నాన్నకు ప్రేమతో’ను ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలబెట్టింది.
ఒక చిన్న మూమెంట్ కూడా చుట్టూ ఉన్న పరిసరాలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది, ఎవ్రీతింగ్ ఈజ్ ఇంటర్ లింక్డ్ అనే కాన్సెప్ట్ నేపథ్యంలో నడిపిన హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ ప్రథమార్ధానికి ప్రధాన ఆకర్షణ. కమర్షియల్ సినిమాల్లో ఇలాంటి కాన్సెప్డ్ బేస్డ్ లవ్ ట్రాక్ అస్సలు ఊహించలేం. ఈ ట్రాక్ తోనే ప్రథమార్దంలో తొలి గంట శరవేగంగా సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ ముందు హీరో-విలన్ మధ్య వచ్చే సన్నివేశం అయితే ‘వావ్’ అనిపిస్తుంది. సుకుమార్ దర్శకత్వ ప్రతిభ.. జగపతి, ఎన్టీఆర్ ల గొప్ప నటన.. అద్భుతమైన డైలాగులు.. ఈ సన్నివేశాన్ని గొప్పగా తీర్చిదిద్దాయి. ఈ సన్నివేశం కానీ.. క్లైమాక్స్ లో మరోసారి హీరో-విలన్ మధ్య వచ్చే సీన్ కానీ.. సినిమాను పతాక స్థాయిలో నిలబెట్టాయి. ద్వితీయార్ధంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ కనిపిస్తాయి.. కొన్ని చోట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది కానీ.. సినిమాలో వృథా అనదగ్గ సన్నివేశాలు చాలా చాలా తక్కువ.
సినిమాలో జగపతి బాబు పాత్ర ఓ మాట అనేసి.. దీని గురించి తర్వాత గుర్తుచెయ్యి అంటూ వేరే విషయంలోకి వెళ్లిపోతుంది. మళ్లీ ఆ టాపిక్ అయిపోయాక ఇందాక గుర్తు చేయమన్నా కదా అంటూ పాత టాపిక్ లోకి వస్తుంది. ఈ కాన్సెప్ట్ ను సుక్కు డీల్ చేసిన తీరు చూస్తే.. స్క్రీన్ ప్లే విషయంలో సుకుమార్ తన సమకాలీన దర్శకుల్లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాడనిపిస్తుంది. సినిమాలో వృథా అనదగ్గ మూమెంట్స్ ఏవీ లేకుండా అతను రాసుకున్న స్క్రీన్ ప్లే ఫెంటాస్టిక్. కమర్షియల్ సినిమా అంటే ఒక రకమైన హద్దులు గీసుకుని కూర్చున్న తెలుగు సినిమాకు మరోసారి ఓ పాఠం నేర్పాడు సుకుమార్.
ఐతే హీరో-విలన్ వార్ విషయంలో ఉన్న ఇంటెన్సిటీని తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ పండించడంలో కనిపించలేదు. విలన్ హీరో తండ్రిని ఎలా మోసం చేశాడు అన్నది మాట మాత్రమైనా చెప్పకపోవడం వల్ల కూడా ఈ ఎమోషన్ క్యారీ కాలేదనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్ కూడా అందరూ అన్నంత గొప్పగా ఏమీ పండలేదు. ఇక సుకుమార్ టిపికల్ నరేటింగ్ స్టయిల్ కారణం.. సినిమా నేపథ్యం వల్ల.. మాస్ ఆడియన్స్ ఈ సినిమాతో అంతగా కనెక్ట్ కాలేక పోవచ్చేమో. అలాంటి వాళ్ల కోసం కొన్నిచోట్ల హీరోయిజం చూపించడం.. మాస్ మసాలా సినిమాల్లో లాగే పాటలు, డ్యాన్సులు పెట్టడం.. ఇలాంటివేవో చేశాడు సుక్కు. ఐతే వాటికి ఆ వర్గం ఆడియన్స్ ఎలా కనెక్టవుతారో కానీ.. పాటలు సినిమాకు పెద్ద అడ్డంకిగా మారాయి. ఐ వానా ఫాలో పాలో పాట వరకు ఓకే కానీ.. మిగతా పాటలేవీ కూడా సినిమాలో సింక్ అవలేదు.
నటీనటులు:
ఎన్టీఆర్ తన దశాబ్దంన్నర కెరీర్ లో చేసిన పాత్రల్ని, సినిమాల్ని ఒక్కసారి తలుచుకుని.. ఆ తర్వాత ఈ సినిమా చూస్తే నమ్మశక్యంగా అనిపించదు. అంత కొత్తగా కనిపించాడతను. సుకుమార్ శైలికి తగ్గట్లు ఎన్టీఆర్ తనను తాను మలుచుకుని నటించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చివర్లో వచ్చే ఎమోషనల్ సీన్లో కంటే కూడా జగపతి ఎదురుగా కూర్చుని దీటుగా ఎదుర్కొనే సన్నివేశాల్లో అతడి నటన గొప్పగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు సీన్లో అతడి నటన ఫెంటాస్టిక్. లుక్ పరంగానే కాదు.. డైలాగులు చెప్పే విషయంలోనూ తారక్ ఎంతో వైవిధ్యం చూపించాడు. ఇక జగపతి బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్టీఆర్ పాత్రకైనా ఇంకొకరిని ఊహించుకోగలమేమో కానీ.. జగపతి స్థానంలో ఎవ్వరినీ ఊహించే సాహసం చేయలేం. జగపతిని సరిగ్గా వాడుకుంటే అతడి పెర్ఫామెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఈ సినిమా సరైన ఉదాహరణ. కనిపించే ప్రతి సన్నివేశంలోనూ అంత బలమైన ముద్ర వేశాడు జగపతి. రకుల్ ప్రీత్ కూడా బాగానే చేసింది. ఆమె డబ్బింగ్ కూడా పర్వాలేదు. గ్లామర్ విషయంలోనూ మార్కులు కొట్టేసింది. మధుబాల కనిపించే మూణ్నాలుగు నిమిషాల్లోనే తన ప్రత్యేక చూపించింది. రాజేంద్ర ప్రసాద్ కు తన టాలెంట్ చూపించే అవకాశం పెద్దగా లేకపోయింది. ఉన్నంతలో బానే చేశారు. రాజీవ్ కనకాల - అవసరాల శ్రీనివాస్ కూడా ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం:
సుక్కు సినిమాలన్నింట్లో లాగే ఇందులోనూ సాంకేతిక నిపుణుల ప్రతిభ కనిపిస్తుంది. విజయ్ చక్రవర్తి ఛాయాగ్రహణం సినిమాకు హైలైట్. దేవిశ్రీ ప్రసాద్ పాటలు బాగున్నాయి కానీ.. చాలావరకు సినిమాలో సింకవలేదు. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల బాగుంది. కొన్ని చోట్ల రొటీన్ మాస్ మసాలా సినిమాల తరహాలో చేయడం నిరాశ కలిగిస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో ఆర్.ఆర్ ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. సినిమాను పూర్తిగా విదేశాల్లోనే చిత్రీకరించారు. ఇక సుకుమార్ దర్శకుడిగా మరోసారి తనదైన ముద్ర వేశాడు. ప్రతి సన్నివేశంలోనూ ఇది సుక్కు సినిమా అనిపించడంలోనే అతడి ప్రత్యేకత కనిపిస్తుంది. ఒక పెద్ద ఫెయిల్యూర్ తర్వాత కూడా ఏమాత్రం రాజీ పడకుండా ఓ వైవిధ్యమైన సినిమా అందించడానికి అతను చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
చివరగా: కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ‘ప్రేమతో’.. సుకుమార్-ఎన్టీఆర్
రేటింగ్- 3/5