Begin typing your search above and press return to search.
నాన్నకు ప్రేమతో.. ఈరోజుతో దుకాణం బంద్
By: Tupaki Desk | 5 Jan 2016 7:47 AM GMTసంక్రాంతికి షెడ్యూల్ చేసిన నాన్నకు ప్రేమతో చిత్రం కోసం.. జూనియర్ అండ్ టీం శరవేగంగా పని చేస్తున్నారు. మరి ఈ సినిమా ప్రస్తుతం ఏ స్టేజ్ లో ఉంది ? పొంగల్ రిలీజ్ కి ఎంతవరకూ అవకాశం ఉంది ? మీకోసం తుపాకి అందిస్తున్న ఎక్ల్ క్లూజివ్ ఇన్ఫో.. సంక్రాంతి పందెం కోళ్లకు మించిన పోటీ కోసం రెడీ అయిపోతున్నారు యంగ్ టైగర్ అండ్ టీం. ఈ మూవీకి సంబంధించిన ప్యాచ్ వర్క్ ను.. ఇవాల్టితో అంటే జనవరి 5తో కంప్లీట్ చేసేస్తున్నారు. సో.. టోటల్ షూటింగ్ అంతటికీ ఇక దుకాణం బంద్ అనమాట.
మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే జరిగిపోతున్నాయి. దాదాపు ప్రధాన నటీనటులంతా తమ వెర్షన్ కి డబ్బింగ్ చెప్పేస్తున్నారు. రీసెంట్ గా ఓన్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోను హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేసింది కూడా. మరోవైపు.. నాన్నకు ప్రేమతోకు సంబంధించిన రీరికార్డింగ్ వర్క్ ను కంప్లీట్ చేసేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఏడో తేదీ మధ్యాహ్నానికల్లా ఫస్ట్ కాపీ చేతిలో పెడతానని చెప్పాడు డీఎస్పీ. దేవిశ్రీ నుంచి ప్రామిస్ రావడంతో.. సెన్సార్ కార్యక్రమాలను కూడా ప్లాన్ చేసేశారు. ఈ నెల 8న నాన్నకు ప్రేమతో చిత్రాన్ని సెన్సార్ చేయించేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారు.
ఆ ఒక్కటి పూర్తి కాగానే ఇక జనవరి 13న రిలీజ్ కు అన్నీ రెడీ అయిపోయినట్లే. అదే రోజు నుంచి అడ్వాన్స్ బుకింగ్ ల హంగామా కూడా స్టార్ట్ కానుంది. ఇప్పటివరకూ ఎన్టీఆర్ ఓ వారం వెనక్కి తగ్గుతాడనే అంచనాలున్నా.. అవన్నీ పుకార్లే అని ఈ అప్ డేట్స్ తో తేలిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి 13నే థియేటర్స్ లోకి రానున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.