Begin typing your search above and press return to search.
తారక్.. నీకోసమే వెయిటింగ్
By: Tupaki Desk | 6 Jan 2016 9:46 AM GMTసంక్రాంతికి షెడ్యూలైన సినిమాల్లో అన్నిటికంటే ముందు రావాల్సింది ‘నాన్నకు ప్రేమతో’. ఈ నెల 13న ఆ సినిమా సంక్రాంతి పందేలకు కొబ్బరి కాయ కొట్టాలి. కానీ దాని తర్వాత రాబోయే మూడు సినిమాలు సెన్సార్ అయిపోయి విడుదలకు చకచకా సన్నాహాలు సాగిస్తుంటే.. ఎన్టీఆర్ సినిమా మాత్రం ఇంకా కిందా మీదా పడుతోంది. నిన్ననే షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ మూవీ.. సెన్సార్ కు వెళ్లడానికి ఇంకా కొన్ని రోజులు టైం తీసుకునేలా కనిపిస్తోంది. విడుదలకు రెండు మూడు రోజుల ముందు కానీ.. సెన్సార్ అయ్యేలా కనిపించట్లేదు. సుకుమార్ ఓ వైపు షూటింగ్ చేస్తూనే డబ్బింగ్ పని కూడా చేయించాడు కానీ.. అయినప్పటికీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొంచెం బ్యాలెన్స్ ఉందట.
ఇక సంక్రాంతి రేసులో ఉన్న మిగతా మూడు సినిమాలు మూడు రోజుల వ్యవధిలో సెన్సార్ జరుపుకున్నాయి. ముందుగా ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సెన్సార్ మూడు రోజుల ముందు అయిపోయింది. దానికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. నిన్న సాయంత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’ సెన్సార్ పూర్తి చేసి రిలీజ్ డేట్ 15న అని కన్ఫమ్ చేశారు. ఈ రోజు ఉదయం బాలయ్య పెట్టిన ముహూర్త ప్రకారం ఉదయం సెన్సార్ షో పడింది. ఈ రెండు సినిమాలకు కూడా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. వెనక రావాల్సిన మూడు సినిమాలూ సెన్సార్ పూర్తి చేసుకుని.. ముందు రావాల్సిన ఎన్టీఆర్ సినిమాపై ఒత్తిడి మరింత పెంచాయి. మరి తారక్ ఎప్పుడు ఈ పని పూర్తి చేస్తాడో?