Begin typing your search above and press return to search.

ట్రైలర్‌ టాక్‌: ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్ అవతార్

By:  Tupaki Desk   |   27 Dec 2015 5:51 PM GMT
ట్రైలర్‌ టాక్‌: ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్ అవతార్
X
'ఆకలి, సెక్స్, నిద్ర.. ఈ మూడు మనుషులకు, జంతువులకు కామన్.. కాని మనుషులను, జంతువులతో వేరు చేసేది ఎమోషన్.. ' ఇదీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ నాన్నకు ప్రేమతో చిత్రంలో స్టార్టింగ్ డైలాగ్. ఒక్క డైలాగ్ తోనే.. ఇది ఎంత డిఫరెంట్ మూవీయే చెప్పేశాడు ఎన్టీఆర్.

నాన్నకు ప్రేమతో ట్రైలర్ లో ప్రతీ ఫ్రేమ్ లోనూ ఎన్టీఆర్ న్యూ లుక్ తో అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు, గెడ్డం, హెయిర్ స్టైల్ రెండూ ట్రెండ్ సెట్టింగ్ రేంజ్ లో ఉన్నాయి. అలాగే ప్రతీ ఫ్రేమ్ ని సూపర్బ్ గా తీసేందుకు డైరెక్టర్ సుకుమార్ పడిన తపన కనిపిస్తోంది. అధిక భాగం యూరోప్ లోనే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. ఇద్దరు బిజినెస్ మెన్ మధ్య మైండ్ గేమ్ అనే విషయాన్ని ట్రైలర్ ద్వారా రివీల్ చేశారు. యంగ్ టైగర్ కి తండ్రిగా రాజేంద్ర ప్రసాద్ నటించగా.. ట్రైలర్ లో మాత్రం కేవలం సిలౌట్ వరకే చూపించి, సస్పెన్స్ మెయింటెయిన్ చేశారు. ఇక స్టైలిష్ విలన్ గా కృష్ణమూర్తి పాత్రంలో జగపతి బాబు చాలా అందంగా కనిపిస్తున్నాడు.

ట్రైలర్ లోనూ ప్రతీ డైలాగ్ గుర్తుండిపోయేవే. ప్రతీ అక్షరం గుర్తుంచుకోవాల్సినదే అనిపించడం ఖాయం. వీటికి ఎన్టీఆర్ తన వాయిస్ ప్రాణం పోశాడని చెప్పాలి. ఇక దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో మరోసారి మెస్మరైజ్ చేసేశాడు. నాన్నకు ప్రేమతో థీమ్ అయినా.. అదిరిపోయేలా ఉన్న బీజీఎం అయినా.. డీఎస్పీని మరో మెట్టు ఎక్కించే స్థాయిలో ఉన్నాయి. బాక్సాఫీస్ ని బద్దలు కొట్టేందుకు ఎన్టీఆర్ ప్రేమతో వస్తున్నాడని ఫాన్స్ ఫిక్స్ అయిపోవచ్చు.