Begin typing your search above and press return to search.
50 కోట్లకు అతి చేరువలో తారక్
By: Tupaki Desk | 26 Jan 2016 3:30 PM GMTఅంతా అయిపోయింది. ఇక తీన్మార్ వేయడమే లేటు. ఎందుకంటే.. ఎప్పటినుండో ఎదురుచూస్తున్న ఆ 50 కోట్ల తరుణం రానే వచ్చింది. తన ఏజ్ గ్రూప్ కు చెందిన స్టార్ హీరోలు అందరూ 50 కోట్ల ''షేర్'' క్లబ్ లోకి దూసుకుపోతుంటే.. ఇక యంగ్ టైగర్ అభిమానులందరూ మనకు ఆ మూమెంట్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశారు. అనూహ్యంగా ఇప్పుడు ''నాన్నకు ప్రేమతో'' సినిమాతో ఆ కల తీరిపోయింది.
అసలు విమర్శకులు ఇచ్చిన వడ్డనకు ఏ మాత్రం సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర సుకుమార్ రూపొందించిన ''నాన్నకు ప్రేమతో'' సంచలనం సృష్టించింది. తొలి (లాంగ్) వీకేండ్ కే దాదాపు 40 కోట్ల షేర్ సాధించేసిన ఈ ఎన్టీఆర్-రకుల్ ప్రీత్ సినిమా.. ఇప్పుడు రిపబ్లిక్ డే హాలిడేను బాగానే ఉపయోగించుకుంది. దాదాపు అన్ని మెయిన్ సెంటర్లలోనూ మ్యాట్నీ నుండి ఫుల్స్ పడ్డాయ్. దానితో ఓ రెండు రోజుల్లో సినిమా ఇక 50 కోట్ల షేర్ మార్కును దాటనుంది. అదే సమయంలో అమెరికాలో కూడా 2 మిలియన్ డాలర్లు గ్రాస్ సాధించే వీలుంది.