Begin typing your search above and press return to search.

నన్ను నేను అడిగా.. 'కార్తికేయ 2' నుంచి ఫుల్ సాంగ్

By:  Tupaki Desk   |   12 July 2022 3:53 AM GMT
నన్ను నేను అడిగా.. కార్తికేయ 2 నుంచి ఫుల్ సాంగ్
X
నిఖిల్ నటించిన 'కార్తికేయ' క‌మ‌ర్షియ‌ల్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.  మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ - కార్తికేయ 2 ఈ ఏడాది జూలై 22 న థియేటర్లలోకి రానుంది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన చందూ మొండేటి ఈ సీక్వెల్ ని తెర‌కెక్కించారు. నిఖిల్ - అనుప‌మ జంటగా నటించారు.

మొదటి భాగం లాగానే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ గా ఇది అల‌రించ‌నుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండగా టీమ్ ప్రమోషన్స్ లో దూసుకుపోతోంది.

నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్  ఇన్ స్టాగ్రామ్ లో ప్ర‌చారం ప‌రంగా దూసుకుపోతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుంచి ల‌వ్ సాంగ్ రిలీజ్ గురించి ప్రకటించారు. ఆసక్తికరంగా లిరికల్ వీడియో మాత్ర‌మే కాకుండా మొత్తం వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ తాజాగా చిత్ర నిర్మాతలు 'నన్ను నేను అడిగా' అనే మెలోడియస్ వీడియో సాంగ్ ని 12 జూలై సాయంత్రం 5:30 గంటలకు జీ మ్యూజిక్ సౌత్ లో విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ ద్వారా వెల్ల‌డించారు.

ఈ సినిమా థియేట్రికల్ రన్ కు ముందు వీడియో సాంగ్ విడుదల చేయడం బాలీవుడ్ తర‌హా ప్లానింగ్ ని త‌ల‌పిస్తోంది. ఇది టాలీవుడ్ లో అరుదైన స్టెప్ అని చెప్పాలి.

ఈ వీడియో సాంగ్ ప్రేక్షకుల్లో ఉత్సాహం పెంచ‌నుంద‌ని భావిస్తున్నారు. కార్తికేయ 2 తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి కంబ్యాక్ ని ఘ‌నంగా చాటేందుకు చందు మొండేటి ప‌ట్టుద‌ల‌గా ప‌ని చేస్తున్నారు.