Begin typing your search above and press return to search.

లేడీ సింగర్స్ ఇద్దరూ.. సేమ్ సెక్స్ కోసం

By:  Tupaki Desk   |   6 Dec 2016 5:30 PM GMT
లేడీ సింగర్స్ ఇద్దరూ.. సేమ్ సెక్స్ కోసం
X
లెస్బన్.. గే కమ్యూనిటీల గురించి మాట్లాడాలన్నా.. వాళ్ల హక్కుల గురించి డిస్కస్ చేయాలన్నా చాలామందికి భయం. సపోర్ట్ చేసే వాళ్లని కామెంట్ చేస్తారనే భయం ఓ వైపు.. మనల్ని ఎక్కడ తేడా అనుకుంటారో అన్న అనుమానాలు మరోవైపు.. పైగా ఇండియాలో వాటిపై బ్యాన్ ఉండటం మరోవైపు.. ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ కి కాస్త దూరంగా ఉండేలా చేస్తాయ్. ఇక సెలబ్రిటీసైతే అచితూచి వ్యవహారిస్తారు.

అయితే బాలీవుడ్ ప్రముఖులు మాత్రం లెస్బన్.. గేల విషయంలో కాస్త బోల్డ్ గానే ఉంటారు. బాలీవుడ్లో ఆ కల్చర్ ఉంది కాబట్టే వాళ్లు సపోర్ట్ చేస్తారనే ప్రచారాలు కూడా ఉన్నాయిలెండి. ఇన్నాళ్లూ మాటలకే పరిమితమైన లెస్బియన్.. గే.. బై సెక్సువల్.. ట్రాన్స్ జెండర్ (LGBT) టాపిక్ సపోర్ట్ ఇప్పుడెకంగా పాటలు వీడియోల రూపంలోకి టర్న్ తీసుకొంది. రీసెంట్ గా నవ్జార్ ఎరానీ అనే డైరెక్టర్ లే యూ డౌన్ అంటూ ఈ సేమ్ సెక్స్ కమ్యూనిటీలకు (స్వలింగ సంపర్కులు) ఫేవర్ గా ఓ సాంగ్ తీశాడు. దోబీ ఘాట్.. యాంగ్రీ ఇండియన్ గాడెస్ మూవీస్ లో యాక్ట్ చేసిన సింగర్-యాక్టర్ మోనికా డోగ్రా అండ్ మరో పాప్ సింగర్ అనుష్క మాన్చందా ఇందులో లెస్బియన్స్ గా కనిపించి రచ్చ చేశారనే చెప్పాలి. వీళ్ల బోల్డ్ యాక్ట్ తో ఉన్న లే యూ డౌన్ వీడియో ఆన్ లైన్లో అయితే సెగలు రేపేస్తోంది.

సేమ్ సెక్స్ కపుల్స్ ను తాము సపోర్ట్ చేస్తామని.. వాళ్లకి కూడా మిగిలిన వాళ్లలాగే హక్కులున్నాయంటున్నారు మోనికా అండ్ అనుష్క. గాయని కూడా అయిన మోనికా గతంలో ఎల్జీబీటీ పీపుల్ కోసం ప్రదర్శన ఇచ్చి విరాళాలు సేకరించింది. ఇక వీడియో సాంగ్ చూసి మా ఇంట్లో వాళ్లు తెగ మెచ్చుకున్నారంటోంది అనుష్క. అది సంగతి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/