Begin typing your search above and press return to search.
రాజా చెయ్యి వేస్తే.. ‘లెజెండ్’ను గుర్తుకుతెస్తోంది
By: Tupaki Desk | 27 April 2016 9:30 AM GMTహీరోగా చేసిన నటులు విలన్ అవతారమెత్తితే జనాల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంటుంది. ‘లెజెండ్’ సినిమా సక్సెస్ కావడానికి సీనియర్ హీరో జగపతి బాబు అందులో విలన్ పాత్ర పోషించడం కూడా ఓ కారణం. విలన్ గా జగపతి బాబు ఎలా ఉంటాడో.. బాలయ్యకు జగపతికి మధ్య పోరు ఎలా ఉంటుందో చూద్దామని జనాలు ఆసక్తిగా ఎదురు చూశారు. వాళ్ల అంచనాలకు తగ్గట్లే తెరమీద వాళ్లిద్దరి వార్ రసవత్తరంగా సాగి జనాల్ని అలరించింది. ఇప్పుడు ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమా విషయంలోనూ జనాల్లో ఇలాంటి ఆసక్తి కనిపిస్తోంది. ఈ సినిమాలో నారా రోహిత్-నందమూరి తారకరత్నల మధ్య పోరు ‘లెజెండ్’ సినిమాను గుర్తుకు తెస్తోంది.
హీరోగా ఒక్క సక్సెస్ కూడా అందుకోలేకపోయిన తారకరత్న ‘అమరావతి’ సినిమా కోసం విలన్ గా మారి మెప్పించాడు. ఆ సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్పుడు ‘రాజా చెయ్యి వేస్తే’ కోసం పూర్తిగా అవతారం మార్చుకుని సరికొత్తగా కనిపిస్తున్నాడు. ట్రైలర్ లో తారకరత్న లుక్.. మేననరిజమ్స్.. డైలాగులు.. అన్నీ చూస్తే ఇది వెయిట్ ఉన్న పాత్రలాగే కనిపిస్తోంది. వైవిధ్యమైన సినిమాలు చేసే నారా రోహిత్ కూడా ఓ స్పెషల్ రోల్ చేసినట్లే కనిపిస్తున్నాడు. సినిమాకు ప్రధాన ఆకర్షణ వీళ్లిద్దరి పోరే అనడంలో సందేహం లేదు. ట్రైలర్ అంతా కూడా నువ్వా నేనా అన్నట్లు వీళ్లిద్దరి మధ్య సాగే పోరునే హైలైట్ చేసింది. జనాలకు కూడా సినిమాకు సంబంధించి ఇంకేం కనిపించట్లేదు. విలన్ పాత్ర ఎంత బలంగా ఉంటే హీరో క్యారెక్టర్ అంత బాగా ఎలివేట్ అవుతుందన్న సూత్రాన్ని ఈ మధ్య మన దర్శకులు బాగానే వంటబట్టించుకుంటున్నారు.
మరి ‘లెజెండ్’లో బాలయ్య-జగపతి మధ్య పోరు హైలైట్ అయినట్లే.. ‘రాజా చెయ్యి వేస్తే’లో రోహిత్-తారకరత్న వార్ సినిమాకు ఆకర్షణగా నిలిచి సినిమా విజయవంతమవుతుందేమో చూడాలి. సాయి కొర్రపాటి నిర్మాణంలో డెబ్యూ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి రూపొందించిన ఈ సినిమా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.