Begin typing your search above and press return to search.
అప్పట్లో ఒకడుండేవాడు.. మామూలు కథ కాదు
By: Tupaki Desk | 1 April 2016 3:42 AM GMTయువ కథానాయకుడు నారా రోహిత్ ఎంచుకుంటున్న కథలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఓ పక్క పెద్ద పెద్ద కథానాయకులు మంచి కథ కోసం నెలలు.. సంవత్సరాలు ఎదురు చూస్తుంటే అతనేమో వైవిధ్యమైన కథలతో శరవేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. అతడి ప్రతి సినిమాలోనూ బలమైన కథ ఉంటోంది. పైగా వైవిధ్యం ఉంటోంది. గత రెండేళ్లలో రోహిత్ చేసిన ప్రతినిధి.. రౌడీఫెలో.. అసుర.. మూడూ కూడా వైవిధ్యమైన కథాబలమున్న సినిమాలే. ‘తుంటరి’ రీమేక్ కాబట్టి దాన్ని పక్కనబెట్టేసినా.. సావిత్రి-రాజా చెయ్యి వేస్తే కూడా కంటెంట్ డ్రివెన్ సినిమాలని అర్థమవుతోంది. రోహిత్ నుంచి తర్వాత రాబోయే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కథ గురించి ఆ చిత్ర దర్శకుడు సాగర్ చంద్ర చెబుతున్న విశేషాలు చూస్తుంటే.. అది కూడా రోహిత్ కెరీర్లో ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నారా రోహిత్.. శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 1992-96 మధ్య కాలం నేపథ్యంలో సాగుతుందట. ఇందులో రోహిత్ నూరుద్దీన్ అనే ముస్లిం పాత్ర పోషిస్తుండటం విశేషం. శ్రీవిష్ణు ఓ క్రిమినల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ కథకు మహాభారతానికి కనెక్షన్ ఉందని అంటున్నాడు సాగర్ చంద్ర. ‘‘మహాభారతంలో కర్ణుడు-దుర్యోధనుడు ముందు శత్రువులుగా కనిపిస్తారు. కానీ చివరికి స్నేహితులుగా మారుతారు. ఇందులోనూ ప్రధాన పాత్రధారుల ప్రయాణం ఇలాగే సాగుతుంది. క్రికెట్.. మాఫియా.. గ్లోబలైజేషన్.. లాంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అలాగే మహాభారతం టచ్ ఉంటుంది. 90ల నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపిస్తున్నాం. తెలుగులో ఇలాంటి కథతో ఓ సినిమా తెరకెక్కలేదని కచ్చితంగా చెప్పగలను. కథలో రోహిత్.. శ్రీవిష్ణులిద్దరివి కీలక పాత్రలే. రోహిత్ పాత్ర దుర్యోధనుణ్ని పోలి ఉంటుంది. శ్రీవిష్ణు క్రికెటర్ కాబోయి.. చివరికి క్రిమినల్ గా మారిన యువకుడిగా కనిపిస్తాడు’’ అని చెప్పాడు సాగర్ చంద్ర.