Begin typing your search above and press return to search.
నారా రోహిత్.. ఆ పాత్ర ఎందుకు చేశాడబ్బా
By: Tupaki Desk | 16 July 2016 3:30 PM GMTఒక గెస్ట్ రోలో.. లేదా క్యామియో రోలో చేస్తే దానికి ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. చేస్తున్న సినిమాకు అది అదనపు ఆకర్షణ కావాలి. ఆ హీరోకు కూడా అది తీపి జ్నాపకం కావాలి. ఐతే ‘నాయకి’ సినిమాలో నారా రోహిత్ చేసిన క్యామియో రోల్ అలా కనిపించలేదు. రోహిత్ ఈ సినిమాలో గెస్ట్ అప్పీయిరెన్స్ ఎందుకిచ్చాడో జనాలకు అర్థం కాలేదు.
సినిమాలో హీరో కాని హీరో సత్యం రాజేష్‌కు ఫ్రెండుగా కనిపించాడు రోహిత్. ఓ సీన్లో రాజేష్ రోహిత్ కు ఫోన్ చేసి అతడి ఫామ్ హౌస్ తాళాలు అడుగుతాడు. ఊరికే ఒక నిమిషం కనిపించే క్యారెక్టర్ అది. రోహిత్ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. ఆ తర్వాత ఇంకోసారి ఫోన్లో అతడి వాయిస్ వినిపిస్తుంది. ఇలాంటి పాత్ర చేయాల్సి అవసరం రోహిత్ కు ఏమొచ్చిందో అర్థం కాని విషయం.
ఇంతకుముందు ‘సారొచ్చారు’ సినిమాలోనూ రోహిత్ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. ఐతే ఆ పాత్రకు సినిమాలో ప్రాధాన్యం ఉంది. పైగా తనకు పరశురామ్ ‘సోలో’ లాంటి హిట్టిచ్చిన కృతజ్నతతో ఆ క్యారెక్టర్ చేశాడతను. ఐతే ‘నాయకి’ సినిమా యూనిట్లో రోహిత్ కు అంత కావాల్సిన వాళ్లెవ్వరూ లేరు. పైగా అతను చేసిన పాత్రకు ప్రాధాన్యం లేదు. అందుకే రోహిత్ ను సినిమాలో చూసిన వాళ్లందరూ ఆశ్చర్యపోతున్నారు.