Begin typing your search above and press return to search.

నారా రోహిత్ ఇంత మారిపోయాడేంటి?

By:  Tupaki Desk   |   21 Feb 2016 11:30 AM GMT
నారా రోహిత్ ఇంత మారిపోయాడేంటి?
X
ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న కొత్త హీరోలు ఎక్కువగా మాస్ ఇమేజ్ కోసం తపించి పోతుంటారు. కంటెంట్ గురించి పెద్దగా పట్టించుకోకుండా మాస్ హీరోగా ఎలివేట్ కావడానికే ప్రయత్నిస్తుంటారు. రొటీన్ సినిమాలే ట్రై చేస్తారు. కానీ నారా రోహిత్ మాత్రం అందరికీ భిన్నంగా ‘బాణం’ లాంటి వైవిధ్యమైన సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత కూడా సోలో - ప్రతినిధి - రౌడీ ఫెలో - అసుర లాంటి వైవిధ్యమైన సినిమాలే చేశాడు. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. రోహిత్ సినిమాలు సీరియస్ గా ఉంటాయని.. అతడి పాత్రలు కూడా అదే తరహాలో ఉంటాయని ఫిక్సయిపోయారు జనాలు.

ఐతే రోహిత్ ఇప్పుడు ఒక్కసారిగా ఇమేజ్ మేకోవర్ కోసం ప్రయత్నిస్తున్నట్లున్నాడు. ‘తుంటరి’ సినిమాలో సరికొత్త రోహిత్ ను చూడబోతున్నామని ఆ సినిమాకు సంబంధించిన ప్రోమోలు చూస్తుంటే అర్థమవుతోంది. రోహిత్ ‘తుంటరి’ అనే పేరు పెట్టుకోవడమే చిత్రమైతే.. ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో అల్లరోడిలా కనిపించి ఆశ్చర్యపరిచాడతను. తాజాగా టీజర్ - ట్రైలర్లలో కూడా రోహిత్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. రోహిత్ లో ఇంత అల్లరోడు ఉన్నాడా అనిపించేలా చాలా సెటైరిగ్గా డైలాగులు చెబుతున్నాడు. ఇక లేటేస్టుగా రిలీజైన ప్రోమో సాంగ్స్ లో సైతం రోహిత్ ను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మామూలుగా రోహిత్ పాటల్లో పెద్దగా హడావుడి చేయడు. సీరియస్ గా ఉంటాడు. రెగ్యులర్ మాస్ పాటలు చేయడు. కానీ ‘తుంటరి’ పాటల్లో మాత్రం అల్లరి వేషాలు చాలానే వేశాడు. ఊర మాస్ కాస్ట్యూమ్స్ తో.. ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టేశాడు. హీరోయిన్ని టీజ్ చేస్తూ.. అల్లరల్లరి చేశాడు. మొత్తానికి ‘తుంటరి’ సినిమా రోహిత్ కు ఇమేజ్ మేకోవర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.