Begin typing your search above and press return to search.
సావిత్రితో సంతోషం దక్కిందన్న హీరో
By: Tupaki Desk | 3 April 2016 5:36 AM GMTయంగ్ హీరో నారా రోహిత్ నటించిన సావిత్రి మూవీ ఈ శుక్రవారమే రిలీజ్ అయింది. హీరోయిన్ నందిత ఈ మూవీలో టైటిల్ రోల్ చేసింది. నారా రోహిత్ రీసెంట్ మూవీ తుంటరి హిట్ కావడంతో.. సావిత్రికి బాగా హెల్ప్ అయింది. అదే రోజున డజనుకు పైగా సినిమాలు రిలీజ్ అయినా.. ఓపెనింగ్స్ విషయంలో ఈ కుర్ర హీరో కుమ్మేశాడని ట్రేడ్ జనాలు అంటున్నారు.
తొలి రోజున మిక్సెడ్ టాక్ వచ్చినా... సావిత్రిని ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ చిత్రం బాగా కనెక్ట్ అయిందని చెప్పచ్చు. ఫుల్ లెంగ్త్ క్లీన్ ఎంటర్టెయినర్ కావడంతో.. కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి సినిమా అనే మౌత్ టాక్ వినిపిస్తోంది. ఈ స్పందనపై నారా రోహిత్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు.
ప్రేక్షకులు సావిత్రిని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ సినిమాకు యూనిట్ అంతా బాగా కష్టపడింది. ముఖ్యంగా దర్శకుడు పవన్ సాదినేని సావిత్రిని ఎంతో అందంగా చిత్రీకరించాడు. నా పాత్రను కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. సావిత్రికి వస్తున్న రెస్పాన్స్ బోలెడు సంతోషాన్ని ఇస్తోంది' అంటున్నాడు నారా రోహిత్. మరి కొన్ని రోజుల పాటు బాక్సాఫీస్ దగ్గర సావిత్రి సత్తా చాటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నది టాలీవుడ్ టాక్.