Begin typing your search above and press return to search.
తుంటరి రోహిత్ లైన్లోకి వచ్చేశాడు..
By: Tupaki Desk | 3 Jan 2016 11:30 AM GMTనారా రోహిత్ అనగానే జనాలకు బొద్దుగా ఉండే రూపం కళ్లముందు కదలాడుతుంది. అందులోనూ గత ఏడాది రౌడీ ఫెలో, అసుర లాంటి సినిమాల్లో మరీ బొద్దుగా కనిపించాడు రోహిత్. పోలీస్ పాత్రల్లో రోహిత్ అలా కనిపించడం చూసి నెగెటివ్ కామెంట్లు పడ్డాయి. దీంతో రోహిత్ అప్రమత్తమయ్యాడు. తన తర్వాతి సినిమాకు పూర్తిగా లుక్ మార్చేశాడు. ఇప్పటికే ‘తుంటరి’ ఫస్ట్ లుక్ లో సరికొత్తగా దర్శనమిచ్చిన రోహిత్.. కొత్త పోస్టర్లలో ఇంకా నాజూగ్గా, ఛార్మింగ్ గా కనిపిస్తున్నాడు.‘తుంటరి’ గురించి అప్ డేట్స్ ఇస్తూ.. ఈ సినిమా కొత్త పోస్టర్లు రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా కోసం రోహిత్ సిక్స్ ప్యాక్ కూడా చేశాడంటున్నారు. ఆ ఎఫెక్ట్ బాడీలో కనిపిస్తోంది.
సన్నబడి ఐడియల్ వెయిట్ లో ఇంతకుముందు ఏ సినిమాలోనూ లేనంత గ్లామర్ గా కనిపిస్తున్నాడు రోహిత్. తమిళ హిట్ మూవీ ‘మాన్ కరాటె’కు రీమేక్ గా గుండెల్లో గోదారి - జోరు సినిమాల ఫేమ్ కుమార్ నాగేంద్ర రూపొందించిన ‘తుంటరి’ ఈ నెల ఆఖర్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందట. త్వరలోనే ఆడియో ఫంక్షన్ చేయబోతున్నారు. ఆవారాగా తిరిగే ఓ కుర్రాడు ఓ లక్ష్యం కోసం బాక్సర్ గా మారి తాను అనుకున్నది సాధించడం మీద ఈ కథ నడుస్తుంది. తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ కథ రాయడం విశేషం. ‘తుంటరి’లో రోహిత్ సరసన కొత్తమ్మాయి లతా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.