Begin typing your search above and press return to search.
పచ్చ షర్టేసిన తుంటరోడు ఇడిగో
By: Tupaki Desk | 19 Jan 2016 7:30 PM GMTనారా వారబ్బాయి స్పీడుని క్యాచ్ చేయడం, ఏ హీరో వల్లా కాదు. టాలీవుడ్ - కోలీవుడ్ - బాలీవుడ్.. ఏ ఇండస్ట్రీ తీసుకున్నా సరే ఒకేసారి డజను స్క్రిప్ట్ లను ఓకే చేసేసిన హీరో ఇంకెవరు కనిపించరు. అసలు ఇన్నాళ్లు ఓ హీరో కోసం వెయిట్ చేయడానికి దర్శకులు రెడీగా ఉంటున్నారంటే.. నారా రోహిత్ క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు.
అలాగని ఏవో రొటీన్ సినిమాలు చేసి, కమర్షియల్ సక్సెస్ కొట్టేయాలనే ప్లాన్స్ కూడా ఈ నారా హీరోకి ఉండవు. చేసిన ప్రతీ సినిమాని దేనికదే విభిన్నంగా ఉండేలా చూసుకుంటూ, తన కెరీర్ గ్రాఫ్ ని అమాంతం పెంచేసుకుంటున్నాడు. ప్రస్తుతం నారా రోహిత్ నటిస్తున్న తుంటరి దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇందులో లతా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పాటల వర్క్ జరుగుతోంది. మాంచి లొకేషన్ లో హీరోయిన్ కి సెక్సీ డ్రెస్ వేసి డ్యూయట్ పాడుకుంటున్నాడు నారా రోహిత్.
ఎర్ర బనియన్ - నీలం లుంగీ - పచ్చ చొక్కా, నల్ల కళ్లజోడు.. ఇన్నీ వేసుకున్న బొద్దైన నారా రోహిత్. కాంబినేషన్ వింటేనే నవ్వొచ్చేలా ఉన్నా.. ఇవన్నీ నారా వారబ్బాయికి బాగానే సెట్ అయ్యాయి. పక్కన లతా హెగ్డే కూడా సీ గ్రీన్ జాకెట్, రెడ్ కలర్ బాటమ్, మెడలో పూసల దండతో బాగా ఎట్రాక్టివ్ గా ఉంది. వీటికి తోడు నాభి కనిపించేలా అందాల ప్రదర్శన. మొత్తానికి నారా వారబ్బాయి పాటలతోపాటు డ్రెసింగ్ లోనూ ఏదో కొత్త ట్రెండ్ ట్రై చేస్తున్నట్లుగా ఉన్నాడు.