Begin typing your search above and press return to search.

పీరియాడిక్ మూవీతో వస్తానంటున్న నారా హీరో

By:  Tupaki Desk   |   5 May 2020 2:30 PM GMT
పీరియాడిక్ మూవీతో వస్తానంటున్న నారా హీరో
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించకుండా హీరో అయ్యారు నారా రోహిత్. బాణం సినిమాతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన తరువాత ‘సోలో’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. వైవిధ్యమైన కథల్లో మాత్రమే నటిస్తూ మెప్పిస్తున్న నారా రోహిత్‌ కొంత కాలంగా సినిమాలేవీ చేయకుండా సైలెంట్ అయ్యాడు. ఆయన చివరగా నటించిన ‘ఆటగాళ్లు’ సినిమా 2018లో విడుదల అయింది. ఇంకా ‘వీరభోగవసంత రాయలు’ సినిమాలో కూడా కనిపించాడు. అయితే కెరీర్ మొదలు పెట్టినప్పుడు సన్నగా ఉన్న రోహిత్ ఆ అనంతరం కాస్త లావుగా తయారయ్యాడు. అయితే తాజాగా ఆయన కొత్త లుక్‌తో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. రోహిత్‌ త్వరలోనే ఓ చిత్రంలో నటించడానికి సిద్ధమైయ్యాడని, అందుకే ఇలా కొత్తగా కనిపిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అయితే ఆ సినిమా ఎవరిదీ అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

2009లో వచ్చిన బాణం సినిమాను చైతన్య దంతులూరి తెరకెక్కించాడు. అయితే తాజాగా ఆయన దర్శకత్వంలోనే 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ సినిమాలో నారా రోహిత్ నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కనుందని టాక్. దర్శకుడిగా చెైతన్య తన మొదటి చిత్రమైన ‘బాణం’ చిత్రంతోనే చెైతన్య మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత బసంతి సినిమాతో మళ్ళీ గట్టిగానే ట్రై చేసినా అది వర్కౌట్ కాలేదు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు. ఈసారి ఎలా అయిన హిట్ కొట్టాలని ఇద్దరూ గట్టిగా ట్రై చేస్తున్నట్లు కన్పిస్తుంది. ఇక ఈ సినిమాను రోహిత్ తన సొంత బ్యానర్ అరన్ మీడియా వర్క్స్ మీద తెరకెక్కించే అవకాశం ఉందని సమాచారం. ఇక తాజాగా రోహిత్ తన మొదటి సినిమా బాణంలోని తన మొదటి షాట్ ఫోటో ట్విట్టర్లో షేర్ చేసాడు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.