Begin typing your search above and press return to search.
నేను ప్రొడక్షన్ పట్టించుకోలేదు -నారా రోహిత్
By: Tupaki Desk | 30 Aug 2016 4:31 AM GMTశ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందిన జ్యో అచ్యుతానంద సెప్టెంబర్ 9న రిలీజ్ కి రెడీ అవుతోంది. విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకున్న నారా రోహిత్.. ఈ మధ్య కొంచెం ట్రాక్ తప్పాడు. కానీ ఈ రొమాంటిక్ కామెడీతో మరోసారి గేర్ మార్చబోతున్నానని అంటున్నడీ హీరో.
-- మళ్లీ లవ్ స్టోరీతో వస్తున్నారు.. మీ ఫీలింగ్ ఎలా ఉంది?
ఈ మధ్య కొన్ని సినిమాలు ఫెయిల్ అయ్యాయి. తిరిగి నా జోనర్ లోకి అడుగుపెట్టేందుకు జ్యో అచ్యుతానంద హెల్ప్ అవుతుంది.
-- గతంలో అన్నీ విభిన్నమైన సినిమాలే చేసేవారు కదా.. ఇప్పుడు రొమాంటిక్ కామెడీ ఎందుకు ఎంచుకున్నారు?
నేను రొమాంటిక్ కామెడీ మూవీస్ ఇష్టపడతానని చాలా మందికి తెలీదు. ఈ స్క్రిప్ట్ వినగానే విపరీతంగా నచ్చేసింది. ఇద్దరు బ్రదర్స్ మధ్య లవ్ స్టోరీ నడిపించిన విధానం నాకు బాగా నచ్చింది
-- ఈ సినిమా సైన్ చేసినపుడు.. నాగ శౌర్యతో చేస్తారని తెలుసా?
తెలుసు.. నాగశౌర్యతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు కొంచెం టెన్షన్ పడ్డాను కూడా. కానీ ఈ సినిమా ఇద్దరు సోదరుల మధ్య జరిగే స్టోరీ. అందుకే తప్పనిసరిగా ఇంకో హీరోతో కలిసి నటించాల్సిందే. టెస్ట్ షూట్ లోనే మా ఇద్దరికీ మంచి బాండింగ్ ఏర్పడింది
-- రెజీనాని తీసుకోవడానికి కారణం ఏంటి?
కాస్టింగ్ కి సంబంధించి ఏ రోల్ కి ఎవరిని తీసుకోవాలో డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాలకు కరెక్ట్ గా తెలుసు. డెసిషన్స్ అన్నీ ఆయనవే.
-- ఇలాంటి సినిమాలకు క్లైమాక్స్ చాలా ముఖ్యం. మరి ఈ మూవీలో చివరకు రెజీనాను చేసుకునేది ఎవరు?
ఈ ప్రశ్నకు సమాధానం అయితే.. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అంతటి థ్రిల్ ఇస్తుంది జ్యో అచ్యుతానంద.
-- మీ రోల్ గురించి చెప్పండి?
ఈ సినిమాలో రెండు వయసుల్లో కనిపిస్తాను. ఒకటి కాలేజ్ స్టూడెంట్ కాగా.. మరొకటి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గెటప్.
-- శంకర ఎప్పుడు రిలీజ్ అవుతుంది?
రిలీజ్ డేట్ కోసం శంకర చాలా రోజుల నుంచి ఎదురుచూస్తోంది. ఇందులో కూడా రెజీనానే హీరోయిన్ కావడంతో.. కనీసం 3 వారాల గ్యాప్ ఉండాలని అనుకుంటున్నా.
-- శ్రీనివాస్ అవసరాలతో ఎక్స్ పీరియెన్స్ ఎలా ఉంది?
అతను చాలా బ్రిలియంట్ డైరెక్టర్. ఆడియన్స్ పల్స్ కరెక్ట్ గా పట్టుకోగలడు. మొదటిసారిగా అనుకుంటా.. నేను ప్రొడక్షన్ వైపు పెద్దగా పట్టించుకోలేదు. సాయి కొర్రపాటి-శ్రీనివాస్ అవసరాల ఇద్దరూ కలిసి అంత చక్కగా పిక్చరైజ్ చేశారు.