Begin typing your search above and press return to search.

నారా రోహిత్.. అసిస్టెంట్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   28 April 2016 7:30 PM GMT
నారా రోహిత్.. అసిస్టెంట్ డైరెక్టర్
X
హీరోగా చక్కగా సినిమాలు చేసుకుంటున్నాడు కదా.. టాలీవుడ్లో ఏ హీరో లేనంత బిజీగా ఉన్నాడు కదా.. ఉన్నట్లుండి నారా రోహిత్ కు డైరెక్షన్ మీదికి మనసెందుకు మళ్లింది అనుకుంటున్నారా..? రోహిత్ నిజంగా అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోలేదులెండి. అతను తెరమీద ఆ పాత్ర పోషిస్తున్నాడు. తన కొత్త సినిమాలో రోహిత్ చేస్తోంది అసిస్టెంట్ డైరెక్టర్ పాత్ర. ఈ సినిమా విశేషాలు వెల్లడిస్తూ.. ‘‘రాజా చెయ్యి వేస్తే.. హీరో - విలన్‌ మధ్య సాగే ఓ మైండ్ గేమ్ తరహా సినిమా. ఈ సినిమాలో నేను రాజా అనే ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ గా కనిపిస్తా. సినిమా కథకు - టైటిల్‌ కు సంబంధం ఏంటో సినిమా చూసే తెలుసుకోవాలి. క్యాచీగా ఉంటుందనే ఈ టైటిల్ పెట్టాం’’ అన రోహిత్ చెప్పాడు.

సినిమాకు తారకరత్న పాత్ర హైలైట్ గా నిలుస్తుందని రోహిత్ చెప్పాడు. ‘‘సింపుల్‌ గా చెప్పాలంటే తారకరత్న లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదేమో. ఈ కథను నాకన్నా ముందే తారకరత్న ఓకే చేశాడు. కజిన్‌ గా నా చిన్నప్పట్నుంచీ అతణ్ని చూస్తున్నా. ఈ సినిమాతోనే మా ఇద్దరి మధ్య బంధం మరింత పెరిగింది. మా ఇద్దరితో పాటు సినిమాలో అన్ని పాత్రలూ బలమైనవే’’ అన్నాడు. వేగంగా సినిమా చేయడం వల్ల క్వాలిటీ తగ్గుతోందన్న విమర్శలపై రోహిత్ స్పందిస్తూ.. ‘‘నా సినిమాల్లో క్వాలిటీ తగ్గడం అన్న మాటే లేదు. నేను 10-20 రోజుల్లో సినిమా చేస్తే క్వాలిటీ తగ్గుందనుకోవచ్చు. షూటింగుకి ముందే అన్నీ పక్కాగా సెట్ చేసుకుని పని మొదలుపెడుతుండటం వల్ల నా సినిమాలు వేగంగా పూర్తవుతున్నాయి. అలాగని క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడట్లేదు’’ అని చెప్పాడు. తన బరువు విషయంలో విమర్శలున్న మాట వాస్తవమని.. బరువు తగ్గమని సలహాలు ఇస్తున్నారని.. జూన్లో మొదలయ్యే తన కొత్త సినిమాలో కొత్తగా కనిపిస్తానని రోహిత్ చెప్పాడు.