Begin typing your search above and press return to search.
తుంటరి వేషంలో కొడతాడా హిట్టు?
By: Tupaki Desk | 7 March 2016 11:30 AM GMTటాలీవుడ్ లో హీరోగా అరంగేట్రం చేయబోయే ప్రతి కథానాయకుడు మాస్ ఇమేజ్ కోసమే తపిస్తాడు. కమర్షియల్ సినిమానే ఎంచుకుంటాడు. కానీ నారా రోహిత్ మాత్రం ‘బాణం’ లాంటి డిఫరెంట్ మూవీతో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత కూడా సోలో - ప్రతినిధి - రౌడీఫెలో - అసుర లాంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రయాణం సాగించాడు. మామూలుగా మన హీరోలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో బోర్ కొట్టేసి ఎప్పుడైనా ఓ వైవిధ్యమైన సినిమా చేయాలని చూస్తారు. కానీ రోహిత్ వరుసగా వైవిధ్యమైన సినిమాలు చేసి.. వాటితో బోర్ కొట్టేయడం వల్ల ఇప్పుడు కమర్షియల్ టచ్ ఉన్న సినిమాలు చేయాలని చూస్తున్నట్లున్నాడు. అందులో భాగంగానే తమిళంలో హిట్టయిన ‘మాన్ కరాటే’ను ‘తుంటరి’ పేరుతో రీమేక్ చేశాడు.
తుంటరి అన్న పేరు చూస్తేనే రోహిత్ తన దారి నుంచి బయటికి వచ్చిన విషయం అర్థమైపోతుంది. ట్రైలర్ చూసినా.. ప్రోమో సాంగ్స్ చూసినా కూడా మాస్ మసాలా అంశాలకు సినిమాలో ప్రాధాన్యం ఇచ్చినట్లు అర్థమవుతోంది. ఐతే ఈ సినిమాకు కథ అందించింది మురుగదాస్ కాబట్టి.. మరీ కంటెంట్ లేకుండా మాస్ మసాలా లకే పరిమితం అయి ఉంటారని అనుకోలేం. ఓ ఆవారా కుర్రాడు.. ఓ లక్ష్యం కోసం బాక్సర్ గా మారి పోరాటం సాగించే కథ ఇది. గుండెల్లో గోదారి సినిమాతో అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కుమార్ నాగేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. కొత్తమ్మాయి లతా హెగ్డే కథానాయిక. ఈ శుక్రవారం పెద్దగా పోటీ లేని తరుణంలో తన సినిమా రిలీజయ్యేలా చూసుకున్నాడు రోహిత్. ఇమేజ్ మేకోవర్ కోసం అతను చేసిన ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.