Begin typing your search above and press return to search.

నారా అండ్ అక్కినేని అబ్బాయిలో.. ఎవరో?

By:  Tupaki Desk   |   21 Oct 2017 6:10 AM GMT
నారా అండ్ అక్కినేని అబ్బాయిలో.. ఎవరో?
X
టాలీవుడ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే హీరో వెంకటేష్. మాస్ - యాక్షన్ అలాగే ఫ్యామిలీ సినిమాలతో ఎక్కువగా అలరిస్తూ ఉంటారు. ముఖ్యంగా కామెడీ తరహా పాత్రలను వెంకీ చాలా బాగా చేస్తాడన్న విషయం అందరికి తెలిసిందే. ఇక త్వరలో మరో కొత్త తరహా పాత్రను చేయబోతున్నాడట ఈ గురు హీరో.

నేనే రాజు నేనే మాత్రి సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన తేజ త్వరలోనే వెంకీతో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ప్రస్తుతం సినిమాలోని పాత్రలను ఎంపిక చేసే పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. ఇందులో వెంకటేష్ ప్రొఫెసర్ లాగా కనిపించబోతున్నాడట. అయితే ఈ సినిమాలో స్పెషల్ పాత్ర కోసం ఒక యువ హీరోని చేయించాలని అనుకుంటున్నాడట దర్శకుడు తేజ. అయితే ఆ పాత్ర కోసం ఇద్దరి పేర్లను కూడా అనుకుంటున్నాడట. సుమంత్ - నారా రోహిత్ ఇద్దరిలో ఎవరో ఒకరిని తేజా ఫైనల్ చేయనున్నాడట. ప్రస్తుతం ఈ కుర్ర హీరోలు వారి ఎగేజ్మెంట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరి హీరోల్లో ఎవరు సెలెక్ట్ అవుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

అయితే ఇప్పటికే మల్టీ స్టారర్ కల్చర్ కు తెరలేపిన వెంకీ.. ఆల్రెడీ మహేష్‌ అండ్ పవన్ లతో సినిమాలు చేసి సంచలనాలు సృష్టించాడు. ఇప్పుడు నాగ చైతన్య అండ్ రానా తో కూడా సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రోహిత్ అండ్ సుమంత్ లతో కూడా అలాంటి ఫీట్ ఏదన్నా చేస్తే.. వెంకీ రేంజే మారిపోతుంది అంతే.