Begin typing your search above and press return to search.

అంతే.. అంతకు మించేమీ లేదు

By:  Tupaki Desk   |   21 Nov 2017 6:14 AM GMT
అంతే.. అంతకు మించేమీ లేదు
X
సినిమా హిట్టు - ఫ్లాపులతో సంబంధం లేకుండా మంచి సబ్జెక్టులు ఎంచుకుంటాడనే పేరున్న హీరో నారా రోహిత్. కానీ ఈమధ్య కాలంలో కమర్షియల్ హిట్ అన్నది అతడికి అందని ద్రాక్షగానే ఉంది. ఇతర యంగ్ హీరోలతో కలిసి చేసిన జ్యో అచ్యుతానంద.. అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలు బాగానే ఆడినా సోలో హీరోగా నటించిన శంకర.. కథలో రాజకుమారి బాక్సాఫీసును ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయాయి.

ఈమధ్య అన్ని సినిమాల్లో కాస్త బొద్దుగా కనిపిస్తూ వస్తున్న నారా రోహిత్ ఎక్సర్ సైజులు అవీ చేసి ఓ ఇరవై కేజీలు తగ్గి బాలకృష్ణుడు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా చెన్నై సుందరి రెజీనా కెసాండ్రా హీరోయిన్ గా నటిస్తోంది. రెజీనా.. నారా రోహిత్ ల ప్రేమ వ్యవహారం ముదిరి పాకాన పడిందని ఎప్పటి నుంచో రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాతో బాగానే క్లోజయ్యారని మాట కూడా వచ్చింది. వీటన్నింటిని నారా రోహిత్ కొట్టి పారేస్తున్నాడు. ‘‘రెజీనాతో ప్రేమలో పడ్డానంటూ వస్తున్న మాటలు నాదాకా వచ్చాయి. అవన్నీ ఉట్టి కబుర్లే. ఇసుమంతైనే నిజం లేవివే. మేమిద్దరం కలిసి చేస్తున్న మూడో సినిమా కావడంతో ఆ రూమర్ కాస్తంత ఎక్కువగా వినిపించింది. మా ఇద్దరి మధ్య ఉన్నది ప్రొఫెనల్ రిలేషన్ షిప్ మాత్రమే.. అంతకు మించి ఏమీ లేదని’’ అంటున్నాడు నారా రోహిత్.

రెజీనా- నారా రోహిత్ ఇంతకుముందు శంకర... జ్యో అచ్యుతానంద సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు ముచ్చటగా బాలకృష్ణుడులో వీళ్లిద్దరూ జంటగా కనిపిస్తున్నారు. పవన్ మల్లెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.