Begin typing your search above and press return to search.
నారా రోహిత్ సెంటిమెంటు జోడించాడుగా..
By: Tupaki Desk | 29 Sep 2016 7:50 AM GMTనటుడిగా తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించాడు నారా రోహిత్. ఆ తర్వాత కూడా అతడి నట ప్రతిభకు రుజువుగా నిలిచే సినిమాలు చాలానే వచ్చాయి. రోహిత్ చేసిన వాటిలో అతడికి పోలీస్ క్యారెక్టర్లు భలేగా కుదిరాయి. మామూలుగా ఓ హీరో కొంత అనుభవం వచ్చాక.. తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నాకే పోలీస్ క్యారెక్టర్ చేస్తాడు. కానీ రోహిత్ మాత్రం తొలి సినిమా ‘బాణం’లోనే ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత రౌడీ ఫెలో.. అసుర లాంటి సినిమాల్లో పోలీస్ పాత్రల్లో అదరగొట్టాడు. అతను ఖాకీ వేసిన ప్రతిసారీ మంచి పేరొచ్చింది. సక్సెస్ కూడా వరించింది.
ఈ నేపథ్యంలోనే రోహిత్ తన కొత్త సినిమాకు ఖాకీ సెంటిమెంటును జోడిస్తున్నట్లు తెలిసింది. రోహిత్ కొత్త సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’లో రోహిత్ పోలీస్ గానూ కనిపిస్తాడని సమాచారం. ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు రోహిత్. అతడు ఇందులో నూరుద్దీన్ మహ్మద్ ఇంతియాజ్ అలీ అనే ముస్లిం క్యారెక్టర్ చేస్తుండటం విశేషం. ఈ పాత్రలో అతను పోలీస్ గా కనిపిస్తాడట. ఐతే ఆ పాత్రలో మరో యాంగిల్ కూడా ఉంటుందట. పోలీస్ పాత్ర చేసిన ప్రతిసారీ సక్సెస్ పలకరించింది కాబట్టి ఈ సినిమా కూడా తనకు పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందని ఆశిస్తున్నాడు రోహిత్. ఇటీవలే ‘జ్యో అచ్యుతానంద’తో చాన్నాళ్ల తర్వాత ఓ హిట్టు ఖాతాలో వేసుకున్న రోహిత్.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’తో సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తానని ఆశిస్తున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/