Begin typing your search above and press return to search.

దర్శకుడిగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్

By:  Tupaki Desk   |   27 April 2016 11:30 AM GMT
దర్శకుడిగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్
X
ఇలా అడుగుతున్నది ఎవరో తెలిస్తే మీరు షాక్ కు గురవ్వాల్సిందే. బోలెడన్ని స్క్రిప్టులు చేతిలో పట్టుకుని కనిపించిన సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడట నారా వారబ్బాయి రోహిత్. అయితే ఇలా అడుగుతున్నది నిజ జీవితంలో అనుకుంటే పొరపాటు పడినట్టే. ఎందుకంటే... తన చుట్టే రోజూ సినిమాలు తీస్తామని ఎంతో మంది డైరెక్టర్లు తిరుగుతున్నారు. ప్రస్తుతం అతని చేతిలో ఓ అరడజను సినిమాలకు పైగా వున్నాయి. ఇక దర్శకత్వంపై దృష్టి సారించే టైమెక్కడిది. మరి దర్శకుడిగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఎందుకు అడుతున్నాడని అనుకుంటున్నారా? అవును ఈనెల 29న విడుదల కాబోయే ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమాలో అతని క్యారెక్టర్ ఇదే నంట.

బోలెడన్ని స్క్రిప్టులు రెడీ చేసుకుని... దర్శకుడిగా స్థిరపడాలని సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వుండే కుర్రాడిగా ఇందులో కనిపిస్తాడట నారా రోహిత్. మొదటి హాఫ్ లో ఇలా కనిపించే రోహిత్.. సెకెండాఫ్ లో అసలు కథ మొదలై.. విలన్ తారక్ తో ఆడే మైండ్ గేమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ వుంటాయట. ప్రస్తుతం ట్రైలర్స్ లో కనిపిస్తున్నట్టు.. వాటికి ఏమాత్రం తీసిపోని రీతిలో ద్వితీయార్థం సాగిపోతుందట. రోహిత్-తారక్ రత్న పోటీ పడి నటించారట. తొలిసారిగా వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే బోలెడంత పాజిటివ్ బజ్ నెలకొంది. రెండు రోజుల్లో మన ముందుకొస్తున్న ఈ చిత్రం అటు నారా కుటుంబ అభిమానులను... ఇటు నందమూరి తారకరత్న అభిమానులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.