Begin typing your search above and press return to search.
పవన్ కి ముందు నారా హీరోనే
By: Tupaki Desk | 29 March 2016 12:33 PM GMTఏప్రిల్ 8న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలవుతోంది. పవన్ స్టామినాకి, పవన్ కళ్యాణ్ పవర్ కి ఎదురెళ్లడం కష్టం కాబట్టి.. ఆ రోజున మరే సినిమాని ప్లాన్ చేయలేదు నిర్మాతలు. ఆ తర్వాత కూడా వరుసగా భారీ సినిమాలు షెడ్యూల్ చేసి ఉంచడం, మరోవైపు ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుండడంతో... చిన్న సినిమాలు ఈ లోపే థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి.
చిన్న సినిమాల హడావిడితో ఏప్రిల్ 1కి భారీ పోటీ నెలకొంది. ఆరోజున ఏకంగా 14 సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉందో అర్ధమవుతోంది. అయితే.. రిలీజ్ లు చాలానే ఉన్నా.. అన్నిటి కంటే ఎక్కువగా ఆసక్తి కలిగిస్తున్న మూవీగా నారావారి సిత్రం ''సావిత్రి'' నే చెప్పాలి. నారా రోహిత్, నందిత జంటగా నటించిన ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఎటాక్ అంటూ మంచు మనోజ్ తో రామ్ గోపాల్ వర్మ తీసిన మూవీలో జగపతిబాబు, వడ్డే నవీన్, ప్రకాష్ రాజ్ లు నటించిన చిత్రం కూడా ఆసక్తిని కలిగిస్తున్నా... అంచనాలు మాత్రం సావిత్రివైపే మొగ్గుతున్నాయి.
రీసెంట్ గా తుంటరితో మాస్ రూపంలో హిట్ కొట్టడం నారా రోహిత్ కి కలిసొచ్చే అంశంగా చెప్పచ్చు. మరోవైపు ఈమూవీకి చేస్తున్న పబ్లిసిటీ కూడా అడ్వాంటేజ్ అవుతోంది. మరి ఈ హైప్ ను సావిత్రి టీం ఉపయోగించుకుటుందో.. బాక్సాఫీస్ దగ్గర చతికిలపడుతుందో తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 1 వరకూ ఆగాల్సిందే