Begin typing your search above and press return to search.
నారా బాబు వచ్చాడు.. రిలీఫ్ కన్ఫమ్
By: Tupaki Desk | 18 Oct 2016 5:30 PM GMTనారా రోహిత్ లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘శంకర’కు ఎట్టకేలకు మోక్షం కలిగినట్లే. ఈ శుక్రవారమే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఎప్పుడో నాలుగేళ్ల ముందు మొదలై.. మధ్యలో రెండేళ్లు అడ్రస్ లేకుండా పోయిన ‘శంకర’.. ఈ మధ్యే వార్తల్లోకి వచ్చింది. గత నెల 16నే రావాల్సిన ఈ సినిమా అనుకోకుండా వాయిదా పడింది. మళ్లీ ఈ నెల 21కి కొత్తగా రిలీజ్ డేట్ ఇచ్చారు. కానీ మధ్యలో ప్రమోషన్ హడావుడి ఏమీ లేకపోవడంతో ఈ సినిమా మళ్లీ వాయిదా పడుతుందేమో అన్న సందేహాలు కలిగాయి. ఐతే ఆ సందేహాలకు తెరదించుతూ రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసింది ‘శంకర’ బృందం.
‘శంకర’ గురించి పట్టించుకోనట్లుగా ఉన్న నారా రోహిత్ కూడా ఈ సినిమా కోసం కదిలాడు. దర్శక నిర్మాతలతో కలిసి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈ శుక్రవారం ‘శంకర’ రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. మరోవైపు బుక్ మై షోలో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి కాబట్టి.. ఈసారి సినిమా విడుదలవడం పక్కా అని భావించవచ్చు. తమిళ హిట్ మూవీ ‘మౌనగురు’కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం నారా రోహిత్ సరసన రెజీనా కథానాయికగా నటించింది. భీమలి కబడ్డీ జట్టు.. ఎస్ ఎంఎస్ లాంటి సినిమాలు తీసిన తాతినేని సత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. చంద్రమౌళి నిర్మించగా.. సాయికార్తీక్ సంగీతాన్నందించాడు. మరి మొదలైన నాలుగేళ్లకు విడుదల కాబోతున్న ‘శంకర’ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/