Begin typing your search above and press return to search.

సావిత్రి కోసం నారా వారి పాట..

By:  Tupaki Desk   |   24 Feb 2016 7:28 AM GMT
సావిత్రి కోసం నారా వారి పాట..
X
నారా రోహిత్ సినిమాలంటే స్పెషల్ గుర్తింపు ఉంది. ఆడియన్స్ ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది. స్టోరీ పరంగా ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేస్తాడనే గుర్తింపు ఉంది. ఇప్పటివరకూ చేసిన అన్ని సినిమాలు నారా రోహిత్ ను ఈ స్థాయికి చేర్చాయి. ఒకేసారి డజన్ సినిమాలకు సైన్ చేసేసే స్థఆయికి తెచ్చాయి. సినిమాలు తీయడంలో స్పీడ్ చూపిస్తూనే.. అదే రంగంలో పలు విభాగాల్లో సత్తా చాటేస్తున్నాడు నారా రోహిత్.

హీరోగా నటించి, మెప్పించడమే కాదు.. ఇప్పటికే సినీ నిర్మాణంలో కూడా చేతులు వేస్తున్నాడు. తను నటిస్తున్న పలు సినిమాల నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు కూడా. ఇదే సమయంలో ఇప్పుడు తనలోని మరో ట్యాలెంట్ ని కూడా బయటకు తీస్తున్నారు నారా వారబ్బాయి. ప్రస్తుతం షూటింగ్ తుది దశకు చేరుకున్న సావిత్రి సినిమా కోసం రోహిత్ పాట పాడాడు. తొలిసారిగా తన సింగింగ్ ట్యాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడన్న మాట. ప్రొఫెషనల్ సింగర్ రేంజ్ లో నారా రోహిత్ పాట ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

శ్రవణ్ సంగీతం అందిస్తున్న సావిత్రి చిత్రంలో నారా రోహిత్ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. ప్రేమ ఇష్క్ కాదల్ చిత్ర దర్శకుడు పవన్ సాదినేని సావిత్రిని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం తుంటరి చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేసిన నారా రోహిత్.. త్వరలోనే సావిత్రిని తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు.