Begin typing your search above and press return to search.
రోహిత్ రఫాడించేశాడు
By: Tupaki Desk | 25 Feb 2016 4:22 AM GMTనారా రోహిత్ గాయకుడి అవతారం ఎత్తాడన్న వార్త బయటికి వచ్చి 24 గంటలైనా గడవలేదు. ఈ వార్త నిజమా కాదా అని జనాలు ఇంకా కొంచెం సందిగ్ధంలో ఉండగానే.. అను పాడిన పాట కూడా బయటికి వచ్చేసింది. బుధవారం సాయంత్రం సావిత్రి చిత్ర యూనిట్ ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి.. ఈ పాటను లాంచ్ చేసింది. ఇప్పటిదాకా తెలుగు హీరోలు పాడిన పాటలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ పాటను ఉత్సాహంగా ఆలపించాడు నారా వారబ్బాయి. రోహిత్ ఈ పాట పాడుతుండగా రికార్డింగ్ థియేటర్లో లైవ్ అంతా షూట్ చేసి.. ఆ విజువల్స్ తో పాటుగా పాటను రిలీజ్ చేశారు.
‘‘రాత రాసినోడు నిన్ను చూసి.. ఒంటరెందుకని నన్ను తోసి.. జంటగా నీతో లింకు వేసి.. వాట్ డు యు సే ఓ సావిత్రి’’.. రోహిత్ పాడిన పాట ఇలా మొదలై... ‘‘ఏ ఆపదా నిన్నాపదే.. నీ వెనుకనే ఉన్నాకదే.. పైపైకలా పంతాలేల.. వెయ్యకు వల చూపుల కల’’.. అంటూ సాగి... చివరికి ‘‘మార్ మార్ తీన్ మార్.. గుండె జారె బార్ బార్’’.. అంటూ ముగిసింది. మొత్తానికి రోహిత్ తొలి పాటతోనే తనదైన ముద్ర వేశాడు.
యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ సావిత్రికి సంగీతం అందిస్తుండగా.. ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేమ్ పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నాడు. నందిత సావిత్రిగా లీడ్ రోల్ చేస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టరుతోనే ఆకర్షించిన ఈ సినిమా.. ఈ మధ్య టీజర్ తోనూ జనాల్ని ఆకట్టుకుంది. సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తున్న రోహిత్.. ‘సావిత్రి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ టైటిల్ ఉన్న సినిమాలో నటించి తన ప్రత్యేకత చాటుకున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ లేదా మే నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.