Begin typing your search above and press return to search.
అవన్నీ పుకార్లే.. 'సోలో'గానే వస్తాడట
By: Tupaki Desk | 4 Nov 2020 6:15 AM GMTబాణం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లు గడిచినా కూడా ఇంకా కమర్షియల్ సక్సెస్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్న యంగ్ హీరో నారా రోహిత్. ఈయన ఆమద్య వరుసగా సినిమాలు చేశాడు. కాని అవి నిరాశ పర్చడంతో ఈమద్య సినిమాకు సినిమాకు మద్య గ్యాప్ ఎక్కువ ఇస్తున్నాడు. ఇదే సమయంలో ఇతర హీరోల సినిమాల్లో నారా రోహిత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి. మొదట అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబో మూవీలో ఈయన కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. చిత్ర టీమ్ ఆయన్ను సంప్రదించారు అంటూ బలంగా వార్తలు వచ్చాయి. కాని తాను ఆ సినిమాలో నటించడం లేదు అంటూ మీడియా వర్గాలకు నారా రోహిత్ చెప్పుకొచ్చాడు.
పుష్ప సినిమాలో మాత్రమే కాకుండా నాని నటిస్తున్న 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో కూడా నారా రోహిత్ నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నారా రోహిత్ మంచి ప్రతిభ ఉన్న నటుడు. ఆయన హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా లేదా విలన్ గా నటిస్తే మంచి మార్కులు పొందుతాడు అంటూ కొందరు సలహా ఇస్తున్నారట. కాని ఆయన మాత్రం ప్రస్తుతానికి సోలో హీరోగానే నటించాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం తదుపరి సినిమా కోసం న్యూ లుక్ ను రోహిత్ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరికొన్నాళ్ల పాటు హీరోగా ప్రయత్నాలు చేసిన తర్వాత ఆయన తన రూటు మార్చుకునే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు.