Begin typing your search above and press return to search.
నారా రోహిత్ కొత్త పోరీని తీసుకొచ్చాడు!
By: Tupaki Desk | 9 Sep 2015 5:11 AM GMTతెలుగు తెరపై మరో కొత్త పోరి సందడి చేయబోతోంది. న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఆ పోరి పేరు... లతా హెగ్డే. ఇండియా సంతతకి చెందిన అమ్మాయిలాగే అనిపిస్తోంది. మోడలింగ్ తో పేరు తెచ్చుకొన్న ఈ సీమ సుందరి ప్రస్తుతం నారా రోహిత్ సరసన ఆడిపాడుతోంది. నారా రోహిత్ కథానాయకుడిగా కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కతున్న విషయం తెలిసిందే. తమిళంలో విజయవంతమైన `మాన్ కరాటే`కి రీమేక్ గా రూపొందిస్తున్నారు. ఇటీవలే మొదలైన ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై నారా రోహిత్ చాలా ఆశలు పెట్టుకొన్నాడు. కచ్చితంగా మరో హిట్టు పడుతుందని నమ్మకంగా ఉన్నాడు.
బొద్దుగా కనిపిస్తున్న నారా రోహిత్ సరసన హీరోయిన్ గురించి చాలా రోజులుగా అన్వేషిస్తోంది చిత్రబృందం. అయితే ఎవ్వరూ సెట్టవ్వలేదు. ఇటీవల న్యూజిలాండ్ కి చెందిన లతా హెగ్డేని ఎంపిక చేసేశారు. ఈమె కూడా నారా రోహిత్ కి తగ్గట్టుగా మంచి ఫీచర్స్ తో కనిపిస్తోంది. ఫేస్ లోనూ తెలుగుదనం కనిపిస్తోంది. అందుకే ఏరి కోరి ఆమెనే ఫిక్స్ చేసేశారు. `గుండెల్లో గోదారి`లాంటి మంచి సినిమాని తీసిన కుమార్ నాగేంద్ర మరోసారి రోహిత్ సినిమాతో సత్తా చాటాలని డిసైడ్ అయ్యాడు. పకడ్భందీగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకొని రంగంలోకి దిగాడు. రోహిత్ కూడా ఇప్పుడు విజయాలబాటలోనే ఉన్నాడు. `అసుర`తో ఆయన మరోసారి అదుర్స్ అనిపించాడు. ఆ విజయోత్సాహంలో ఉన్న రోహిత్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో జర్నీ చేస్తున్నాడు.