Begin typing your search above and press return to search.
600 స్క్రీన్లలో ‘తుంటరి’
By: Tupaki Desk | 10 March 2016 9:21 AM GMTనారా రోహిత్ గత చిత్రాల కంటే... తాజాగా నటించిన ‘తుంటరి’ చిత్రం హయ్యస్ట్ స్క్రీన్లలో ప్రదర్శించబోతున్నారు. గతంలో ఏ ముడొందలో.. నాలుగొందల థియేటర్లలో మాత్రమే నారా వారబ్బాయి చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈసారి మాత్రం స్క్రీన్ల సంఖ్యను అమాంతం పెంచేశారు. కథలో కంటెంట్ వుండటంతో... ఎంతో పాజిటీవ్ గా వుంది చిత్ర బృందం. ఈ సినిమా మాతృక అయిన ‘మాన్ కరాటే’ తమిళంలో దాదాపు రూ.55 కోట్లు కలెక్ట్ చేయడం వల్ల తెలుగులో కూడా కలెక్షన్ల వర్షం కురిపించాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ చిత్రాన్ని దాదాపు 600 స్క్రీన్లలో ప్రదర్శించడానికి ప్లాన్ చేశారు.
నారా రోహిత్ ఇందులో బాక్సర్ గా కనిపిస్తాడు. తనకు ఏది తెలిస్తే.. అదే నిజం అని నమ్మే ఓ ఇన్నోసెంట్ తుంటరి అని దర్శకుడు కుమార్ నాగేంద్ర చెబుతున్నాడు. అందుకే ఈ తరం ప్రతి ఒక్క కుర్రాడికి తుంటరి సినిమా కనెక్ట్ అవుతుందని ఎంతో నమ్మకంగా చెబుతున్నాడు. తన గత చిత్రాల తాలూకు ప్రభావం ఈ మూవీపై ఏమాత్రం వుండదని కూడా చెబుతున్నాడు. దానికి కారణం కంటెంట్ ఒక కారణం అయితే... మరో కారణం హీరో నారా రోహిత్. తన నటన ఇందులో హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నాడు.
ఈనెల 11న విడుదలవుతున్న తుంటరి సినిమాకి ఇప్పటికే బోలెడంత పాజిటివ్ బజ్ వచ్చేసింది. పాటలు... పోస్టర్ల దగ్గర్నుంచి ట్రైలర్ల వరకు అన్ని రకాలుగా చిత్రానికి కావాల్సినంత ప్రచారం వచ్చేసింది. ఇక థియేటర్లో బొమ్మ పడటమే తరువాయి. చూద్దాం ఈ ‘తుంటరి’ వేశాలు ప్రేక్షకులను ఎలా మెస్మరైజ్ చేసేసి కాసుల వర్షం కురిపిస్తాయో.