Begin typing your search above and press return to search.
ఫొటో స్టోరీ: సెట్లో హీరో గరిట పడితే..
By: Tupaki Desk | 30 Jun 2017 5:02 AM GMTమన హీరోల్లో బయటికి తెలియని చాలా టాలెంట్లుంటాయి. ఆ టాలెంట్లు సినిమాల షూటింగ్ జరిగేటపుడు బయటపడుతుంటాయి. నారా వారబ్బాయి రోహిత్ లోనూ ఒక టాలెంట్ ఉంది. అతను వంటలు బాగా చేస్తాడు. ఈ సంగతి అతడితో సినిమాలు చేసే వాళ్లకు బాగా తెలుసు. గతంలో ‘సావిత్రి’ సినిమా షూటింగ్ సందర్భంగా రోహిత్ ఆరు బయట వంట చేస్తున్న ఫొటోలు బయటికి వచ్చాయి. ఇంకా కొన్ని సినిమాల షూటింగ్ గ్యాప్ లో రోహిత్ తన పాక శాస్త్ర నైపుణ్యాన్ని చూపించాడు. తాజాగా నారా రోహిత్ మరోసారి తన టాలెంట్ బయటికి తీశాడు.
తన కొత్త సినిమా ‘శమంతకమణి’ షూటింగ్ గ్యాప్ లో రోహిత్ గరిట పట్టాడు. ఈ చిత్రంలో రోహిత్ ఫెరోషియస్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్యారెక్టర్ కోసం మేకప్ వేసుకుని.. అలాగే గరిట పట్టాడు రోహిత్. అతను చేసిన వంటకం చేపల పులుసు కావడం విశేషం. పెద్ద పాత్రలో సెట్లో ఉన్న వాళ్లందరికీ సరిపోయేలా చేపల పులుసు వండి పెట్టాడు రోహిత్. అతడికి కమెడియన్ రఘు కారుమంచి సాయం చేశాడు. ఇలా హీరో సెట్లో ఉన్న వాళ్ల కోసం చేపల పులుసు చేస్తుండటం అందరి దృష్టినీ ఆకర్షించింది. అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. కొందరు ఫొటోలు తీసుకోవడం మొదలుపెట్టారు. మరి రోహిత్ చేసిన చేపల పులుసు టేస్టేంటో ‘శమంతకమణి’ యూనిట్ సభ్యులే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/