Begin typing your search above and press return to search.

నారా బాబు అంత మారిపోయాడే!!

By:  Tupaki Desk   |   9 April 2017 8:54 AM GMT
నారా బాబు అంత మారిపోయాడే!!
X
నారా రోహిత్ అన్నా.. ఈ హీరో సినిమాలన్నా.. టాలీవుడ్ లో స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. కచ్చితంగా డిఫరెంట్ యాంగిల్ లో మూవీ ఉంటుందనే నమ్మకమే ఇందుకు కారణం. ఒకట్రెండు సార్లు రెగ్యులర్ సినిమాలు వచ్చినా.. ఎక్కువగా మాత్రం కొత్త కథా కథనాలను అందించే విషయంలో నారా రోహిత్ సక్సెస్ అయ్యాడు.

అయితే తొలి నుంచి ఈ నారా హీరోపై ఉన్న విమర్శ.. లావుగా ఉంటాడనే. చాలా సార్లు తను తగ్గుతానని.. నెక్ట్స్ మూవీలో స్లిమ్ గా కనిపిస్తానని.. సిక్స్ ప్యాక్ చేసేస్తానని కూడా చెప్పినా.. ఇప్పటివరకూ మాట నిలబెట్టుకోలేదు నారా రోహిత్. కానీ ఈ మధ్య విమర్శల డోస్ పెరిగిపోవడంతో.. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడట. కొన్ని నెలలుగా జిమ్ లో విపరీతంగా కష్టపడిపోతూ.. స్లిమ్ గా అయిపోయాడని తెలుస్తోంది. ఉదయం సాయంత్రం.. 3 గంటలు వర్కవుట్స్ చేస్తూనే ఉంటున్నాడట రోహిత్.

అంతేకాదు.. తన ట్రైనర్ చెప్పినట్లు ఫుడ్ విషయంలో కూడా బాగా నియంత్రణ పాటించడంతో.. ఇప్పుడు బాగా సన్నగా కనిపిస్తున్నాడు కూడా. రీసెంట్ గా టీఎస్ ఆర్ అవార్డుల్లో కనిపించిన ఈ నారా హీరో.. తన కొత్త రూపాన్ని అందరికీ చూపించి షాక్ ఇచ్చేశాడు. ఇంత షార్ట్ పీరియడ్ లో ఇంతగా తగ్గడానికి నారా రోహిత్ చాలానే హార్డ్ వర్క్ చేశాడని సన్నిహితులు చెబుతున్నారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/