Begin typing your search above and press return to search.
ఫస్ట్ లుక్: సీమసంగ్రామ 'బాలకృష్ణుడు'
By: Tupaki Desk | 24 July 2017 1:51 PM GMTవైవిధ్యబరితమైన సినిమాలను ఎంచుకోవడంలో నారా రోహిత్ దిట్ట. మనోడు మొదటినుండీ తన కొత్త కొత్త పందా కథలతో ఇంప్రెస్ చేయడమే కాదు.. ఆ సినిమాల తాలూకు పోస్టర్లు కూడా చాలా కొత్తగా ఉంటాయి. మొదటి సినిమా బాణం అయినా.. మొన్న వచ్చిన రౌడీ ఫెలో అయినా.. ఆ తరువాత వచ్చిన ఏ సినిమా అయినా కూడా.. ఎందుకో రోహిత్ తన దర్శకుల సూచనలతో కలుపుకుని చాలా క్రియేటివ్ గా ఉన్న పోస్టర్లను దింపేస్తుంటాడు.
ఇకపోతే ఇప్పుడు తన కొత్త సినిమా ''బాలకృష్ణుడు'' పోస్టర్ తో కూడా ఇదే విధంగా షాకిచ్చాడు. ఈ సినిమా పోస్టర్ ను చూడగానే అసలు మనం రోహిత్ నే చూస్తున్నామా అనేంత కొత్తగా ఉంది. ముఖ్యంగా బాగా స్లిమ్ అయిన తరువాత తన బాడీని చూపిస్తూ షర్టు బొత్తాలు విప్పేసి ఇచ్చిన ఫోజు ఏదైతే ఉందో... అది అదిరిపోయింది. పైగా ఈ సినిమా పోస్టర్లో భలే కథను చెప్పాశారు. ఒకవైపు హైదరాబాద్ బుద్దుడు ఛార్మినర్.. మరోవైపు కర్నూలు కొండారెడ్డి బురుజు.. ఇంకో వైపు లైన్లో వెళుతున్న సుమోలు.. గాల్లో తేలుతున్న సుమోలు.. వావ్ ఇదంతా చూస్తుంటే ఇదో సీమసంగ్రామం అనిపించట్లేదా?? అనిపిస్తుంది.
ఇవన్నీ ఒకెత్తయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మరో ఎత్తు. ఆల్రెడీ నందమూరి బాలకృష్ణ వీరికి బంధువులు కాబట్టి.. పైగా చిన్నప్పటి నుండి రోహిత్ బాలయ్య అభిమాని కాబట్టి.. సినిమాకు ''బాలకృష్ణుడు'' అనే టైటిల్ పెట్టడం అంటే.. తన అభిమానం ఏ స్థాయిలో ఉందో చాటుకోవడమే. అందుకే ఇప్పటివరకు రోహిత్ పోస్టర్లన్నింటిలోకి ఇప్పుడు ఈ పోస్టర్ అతి పెద్ద సంచలనం అయిపోయింది. కొత్త దర్శకుడు పవన్ మల్లెల ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.