Begin typing your search above and press return to search.

నారా ‘బాలకృష్ణుడు’ అదిరిపోయాడు

By:  Tupaki Desk   |   23 Sep 2017 6:45 AM GMT
నారా ‘బాలకృష్ణుడు’ అదిరిపోయాడు
X
ఒకట్రెండు హిట్లు కొట్టడం.. తర్వాత కొంచెం ట్రాక్ తప్పడం.. మళ్లీ పుంజుకుని సక్సెస్ సాధించడం.. నారా రోహిత్ కెరీర్ ఆరంభం నుంచి నడుస్తున్న వ్యవహారమే. గత ఏడాది ఆరంభంలో వరుస ఫ్లాపులతో దెబ్బ తిన్న రోహిత్.. ఏడాది చివర్లోకి వచ్చేసరికి ‘జ్యో అచ్యుతానంద’.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ లాంటి మంచి విజయాల్ని ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఈ ఏడాది ‘శమంతకమణి’.. ‘కథలో రాజకుమారి’ సినిమాలు అతడికి నిరాశను మిగిల్చాయి. ఐతే ఇప్పుడు తన కొత్త కొత్త సినిమా ‘బాలకృష్ణుడు’ విషయంలో చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు రోహిత్. గత నెలలో వచ్చిన ‘బాలకృష్ణుడు’ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.

ఐతే ఫస్ట్ లుక్ లో నారా రోహిత్ రూపానికి ఏవో స్పెషల్ ఎఫెక్టులు జోడించినట్లుగా అనిపించింది. ఇప్పుడు రోహిత్ ఒరిజినల్ లుక్ లోకి వచ్చాడు. ఇంతకుముందెన్నడూ రోహిత్ ను ఇలా చూడలేదంటే అతిశయోక్తి లేదు. బాగా సన్నబడి.. ఫార్మల్ లుక్ లోకి మారిపోయి ఆశ్చర్యపరిచాడు రోహిత్. నారా బాబు ఎప్పుడూ ఇంత ఫార్మల్ అవతారంలో కనిపించింది. కొత్త దర్శకుడు పవన్ మల్లెల రూపొందించిన సినిమా ఇది. ముగ్గురు కొత్త నిర్మాతలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నారా రోహిత్ ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతుండటం విశేషం. అక్టోబరు నెలాఖరులో ‘బాలకృష్ణుడు’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.