Begin typing your search above and press return to search.
నా బలం బలహీనత తెలిసింది -నారా రోహిత్
By: Tupaki Desk | 4 Jan 2017 5:30 PM GMTఅప్పట్లో ఒకడుండేవాడు అంటూ నారా రోహిత్ ఏడాది చివర్లో ఊహించని విజయం సాధించాడు. శ్రీవిష్ణుతో కలిసి నారా రోహిత్ కొట్టిన హిట్.. అతని కెరీర్ లోనే మైలు రాయిగా నిలిచిపోనుంది. ఈ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటున్నాడు నారా రోహిత్.
ఈ చిత్రానికి స్పందన ఎలా ఉంది?
ఈ మూవీకి వచ్చిన స్పందన చాలా సంతోషంతో పాటు స్ఫూర్తిని ఇచ్చింది. ఈ వారంతో మేం లాభాల్లోకి రానున్నామంటే.. ఈ చిత్రం సాధించిన విజయం అర్ధమవుతుంది.
ఇంత తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్న సినిమా ఎందుకు చేశారు?
నా కేరక్టర్ లెంగ్త్ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. ఇంతియాజ్ ఆలీగా నా పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని అనిపించింది. అలాంటి రోల్ చేసే అవకాశం దక్కడం నా అదృష్టం. మెయిన్ లీడ్ కాకపోయినా ఆ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.
అప్పట్లో ఒకడుండేవాడు పై ఇంకేమన్నా చెబుతారా?
ఈ స్క్రిప్ట్ రెండేళ్ల నుంచి మా దగ్గర ఉంది. స్క్రిప్ట్ దశలోనే చాలావర్క్ చేశాం. నా రోల్ కి హీరోయిన్ ని అనుకున్నాం కానీ.. తర్వాత ఆ పాత్ర తీసేశాం. జూన్ లోనే విడుదల చేద్దామని అనుకుంటే జ్యో అచ్యుతానంద రిలీజ్ కి షెడ్యూల్ అయింది. తర్వాత డిమానిటైజేషన్ కారణంగా మరో రెండు నెలలు వాయిదా పడింది.
శ్రీవిష్ణు కోసం ఈ సినిమా చేశారనే టాక్ ఉంది?
శ్రీ విష్ణు నాకు చాలా కాలంగా తెలుసు. నాకు ట్యాలెంట్ లేకపోతే అతనిపై సినిమా తీయను. అతనితో ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగా ఈ మూవీ తీశా అనుకున్నా సరే నేను పట్టించుకోను.
2016 మీకు ఎలా గడిచింది?
ఈ ఏడాది ఫెయిల్యూర్స్ నుంచి చాలానే నేర్చుకున్నా. ఒకేసారి అనేక సినిమాలు చేసి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేయకూడదని ఫిక్స్ అయ్యా. నా బలం ఏంటో.. బలహీనత ఏంటో కూడా తెలిసింది.
కొత్త ఏడాది నిర్ణయాలేంటి?
ఫిట్ గా మారేందుకు ఇప్పటికే వర్కవుట్స్ ప్రారంభించాను. పవన్ మల్లెల దర్శకత్వంలో తెరకెక్కే కమర్షియల్ మూవీ ఫిబ్రవరిలో ప్రారంభం కానుండగా.. ఆ సమయానికి ఫిట్ గా మారగలననే నమ్మకం ఉంది.
భవిష్యత్తులో కూడా సినిమాలు నిర్మిస్తారా?
నా బ్యానర్ లో రూపొందే తర్వాతి సినిమా శ్రీవిష్ణుతోనే ఉంటుంది. ఇప్పటికే దాదాపు కంప్లీట్ అయింది కూడా. నాకు స్క్రిప్ట్ నచ్చితే ఖచ్చితంగా సినిమాలు నిర్మిస్తా.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/