Begin typing your search above and press return to search.
విడుదలకు నెల ముందే సెన్సార్
By: Tupaki Desk | 27 July 2017 1:48 PM GMTఇంకో వారం రోజుల్లో సినిమా విడుదల అనగా.. అప్పుడెళ్లి సెన్సార్ తంతు ముగిస్తుంటారు నిర్మాతలు. ఐతే నారా రోహిత్ కొత్త సినిమా ‘కథలో రాజకుమారి’ విషయంలో మాత్రం నిర్మాతలు మరీ త్వరపడిపోయారు. విడుదలకు నెల రోజులుండగానే సెన్సార్ పని ముగించేశారు. ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానున్నట్లు మొన్న నారా రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే ‘కథలో రాజకుమారి’ సెన్సార్ అవగొట్టేయడం విశేషం. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి కట్స్ ఏమీ లేకుండా ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. అంటే ఈ చిత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నమాట.
టైటిల్ లోగో లాంచ్ దగ్గర్నుంచి ‘కథలో రాజకుమారి’ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. నారా రోహిత్ ఫస్ట్ లుక్.. ఆ తర్వాత వచ్చిన టీజర్.. ట్రైలర్ అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. సినిమా మీద పాజిటివ్ ఫీల్ కలిగించాయి. ఈ చిత్రంతో మహేష్ సూరపనేని అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నప్పటికీ మంచి టైమింగ్ కోసం చూసి.. ఆగస్టు 25కు ఫిక్సయ్యారు. రోహిత్ సరసన ‘చుట్టాలబ్బాయి’ ఫేమ్ నమిత ప్రమోద్ నటిస్తున్న ఈ చిత్రంలో నాగశౌర్య.. నందిత ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాతో పాటు ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో మంచి గుర్తింపు సంపాదించిన విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతాన్నందిస్తున్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాను నిర్మించిన కృష్ణ విజయ్.. ప్రశాంతిలతో పాటు సౌందర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.