Begin typing your search above and press return to search.
నారా బాబూ.. ఇంకో షాకిస్తాడా?
By: Tupaki Desk | 14 Feb 2017 10:23 AM GMTప్రేమికుల దినోత్సవ కానుకగా కొత్త సినిమాల విశేషాలు చాలానే బయటికి వచ్చాయి. వాటన్నిట్లోనూ ‘కథలో రాజకుమారి’ ఫస్ట్ లుక్ స్టాండ్ ఔట్ గా నిలిచింది. నెవర్ బిఫోర్ అవతార్లో నారా రోహిత్ అదరగొట్టేశాడు. అతడి లుక్ చూసి అందరూ షాకైపోయారు. సినిమా టైటిల్ కు.. రోహిత్ అవతారానికి అసలు పొంతనే లేదు. గడ్డం పెంచుతుంటే రగ్ లుక్ లోకి మారతాడని అంచనా వేశారు కానీ.. మరీ ఇలా తయారవుతాడని అనుకోలేదెవవ్వరూ. ఈ లుక్ చూశాక ఇది ఏ తరహా సినిమా అయి ఉంటుందో అన్న అంచనాల్లో మునిగిపోయారు జనాలు. రోహిత్ అవతారాన్ని బట్టి ఇది విలేజ్ బేస్డ్ ఫ్యాక్షన్ స్టోరీ అయ్యుండొచ్చనిపిస్తోంది.
ఐతే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇది సినీ నేపథ్యంలో సాగుతుందంటున్నారు. కాబట్టి సినిమాలో భాగంగా రోహిత్ ఇలా కనిపించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అలాంటపుడు ప్రేక్షకుల్ని ముందుగా కొంచెం ప్రిపేర్ చేయాలి. లేదంటే ఇప్పుడు సర్ప్రైజ్ చేసి క్యూరియాసిటీ పెంచడం వరకు బాగానే ఉంటుంది కానీ.. ఆ తర్వాత ఆడియన్స్ ఏదో ఊహించుకుని సినిమాకు వచ్చి.. ఇంకేదో బొమ్మ కనిపిస్తే పంచ్ పడిపోతుంది. గతంలో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఊకొడతారా ఉలిక్కి పడతారా’ విషయంలో ఇలాగే జరిగింది. పోస్టర్లలో మనోజ్ భీకర అవతారాన్ని చూసి ఏదో ఊహించుకున్నారు. ఐతే ఆ అవతారం కేవలం పాటకే పరిమితమైంది. కాబట్టి ఏదైనా కొత్తగా.. ప్రయోగాత్మకంగా చేసేటపుడు ప్రేక్షకుల్ని ఆ దిశగా ప్రిపేర్ చేయడం అన్నది కీలకం. ‘కథలో రాజకుమారి’ టీం కూడా మున్ముందు ప్రమోషన్లలో ఆ విషయం గుర్తుంచుకోవాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/