Begin typing your search above and press return to search.
గోపీచంద్ మీద నారా అటాక్
By: Tupaki Desk | 12 July 2017 10:58 AM GMTఅసలే హీరో గోపీచంద్ కెరీర్ ఒడుదొడుకులతో సాగుతోంది. అతడి చివరి సినిమా ‘సౌఖ్యం’ డిజాస్టర్ కాగా.. తర్వాత చేసిన ‘ఆక్సిజన్’ విడుదలకే నోచుకోకుండా ఆగిపోయింది. దీంతో పాటు ‘ఆరడుగుల బుల్లెట్’ను బయటికి తేవడానికి చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. ఈ నేపథ్యంలో గోపీ ఆశలన్నీ ‘గౌతమ్ నంద’ మీదే నిలిచాయి. గోపీ ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా ఈ సినిమా బాగానే క్రేజ్ తెచ్చుకుంది. జనాల దృష్టిని ఆకర్షించింది. బిజినెస్ కూడా బాగానే జరిగిందంటున్నారు. ఈ నెల 28న పోటీ లేకుండా సోలోగా బాక్సాఫీస్ బరిలో ఈ సినిమాను దించేయడానికి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఈ చిత్రానికి గట్టి పోటీ తప్పదని తెలుస్తోంది.
నారా రోహిత్ కొత్త సినిమా ‘కథలో రాజకుమారి’ని కూడా ఈ నెల 28నే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం ఇంకా ముందే విడుదల కావాల్సింది. ఐతే రోహిత్ నటించిన మరో సినిమా ‘శమంతకమణి’ ముందు విడుదల కావాల్సి ఉండటంతో దీన్ని వాయిదా వేశారు. ఐతే జులై నెలను వదిలేస్తే.. ఆగస్టు.. సెప్టెంబరు నెలల్లో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మంచి రిలీజ్ డేట్ దొరకడం కష్టం. అందుకే జులై 28నే ‘కథలో రాజకుమారి’ని విడుదల చేసేయాలని భావిస్తున్నారు. మహేష్ సూరపనేని అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం టీజర్.. ట్రైలర్లతో జనాల దృష్టిని బాగానే ఆకర్షించింది. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. క్లాస్ ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ సినిమా నుంచి ‘గౌతమ్ నంద’కు గట్టి పోటీ తప్పదన్నమాటే. పైగా ఇది తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన సినిమా. కానీ ‘గౌతమ్ నంద’ పరిస్థితి దీనికి భిన్నం. మరి ఈ నెల 28న ఈ రెండింట్లో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి.