Begin typing your search above and press return to search.
బాణంలా మారి షాకిచ్చాడే
By: Tupaki Desk | 26 July 2017 5:46 AM GMTతెలుగు యంగ్ హీరోలు చాలమందే ఉన్నారు ఇప్పుడు వాళ్ళలో కొంతమందికి మాస్ ఇమేజ్ ఉంది కొంతమందికి లవర్ బోయ్ ఇమేజ్ ఉంది. కాని కొంతమందికి మంచి పేరు మాత్రమే ఉంటుంది ఏ ఇమేజ్ ఉండదు. అంటే అలాంటి వాళ్ళు కొత్త కథలు చెప్పడానికి ప్రయోగాలు చేసే అవకాశం ఉన్న రకం అన్నమాట. బాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులుకు పరిచయమైన హీరో నారా రోహిత్.. మొదటి సినిమా నుండే తనకంటూ ఒక శైలి ఏర్పాటు చేసుకొని కమర్షియల్ సినిమా తరహాలోనే కొంచం వైవిద్యం చూపిస్తూ తన గంభీరమైన గొంతుతో అలరిస్తున్నాడు.
అయితే అంతా బాగనే ఉంది కాని.. బాబు కొంచం బొద్దుగా ఉంటాడు అన్న ఒక్కమాట మాత్రం వినిపించేది. మొదటిలో సుమారుగా ఉన్న ఆ తరువాత తరువాత రోహిత్ కొంచెం ఒళ్ళు చేశాడు. దానితో మొదటిలో ఉన్న ఇమేజ్ కొంచెం పక్క దారి పడుతుంది ఏమో అనిపించింది అందరికి. బాడీది ఏమీ ఉంది సినిమాలో కంటెంట్ ఉండాలి అనే సూత్రంతో నడిపిస్తున్న రోహిత్ ఇప్పుడు తన బరువు తనకే ఇబ్బంది అనిపించిది ఏమో లేక సినిమా కోసం అవసరం పడింది ఏమో కాని ఒళ్ళు తగ్గించి జిమ్ చేసి చూస్తుండగానే సిక్స్ ప్యాక్ చేసేశాడు. అయితే ఇదంతా ఎవ్వరికీ నమ్మశక్యం కాలేదు. కాని 'బాలకృష్ణుడు' సినిమా లుక్కు మాత్రం షాకిచ్చేసింది.
అందులో రోహిత్ బొత్తాలు విపేసిన చొక్కాతో తగ్గిన బాడీతో చేసిన సిక్స్ ప్యాక్ తో ఉన్న ఇమేజ్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది. బొద్దుగా ఉన్న ఆ అబ్బాయి ఒక్కసారి ఇంతలా మారేసరికి అసలు ఎవ్వరూ నమ్మట్లేదు. అయితే నిజంగానే ఇప్పుడు రోహిత్ బాడీని కరిగించి ఇలా ఆరుపలకలు చెక్కేశాడట. అది సంగతి.